పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[హేతువాది]] .'''పింగళి దశరధరామ్''' తన స్వీయ సంపాదకత్వంలో [[విజయవాడ]] సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపే వాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపిలతో మొదలు పెట్టబడింది.. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను , ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్పూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట. దాదాపు 5 లక్షల కాపీలవరకు అమ్ముడు పోయ్యేదని చెప్పుకుంటారు.
 
 
ఇతను అనుమానాస్పద పరిస్థితులలో 1985వ[[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21వ21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతర అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రాహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికి ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు(మనదేశ జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు. ఇతని భార్య విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.
 
==రచనలు==
పంక్తి 16:
==మూలాలు==
[http://www.dailyexcelsior.com/02aug01/national.htm]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు