ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: బి.సి.డి.గ్రూపులోని కులం.కటికోళ్ళు ...కసాయిలు ...అనికూడా వీరిన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బి.సి.డి.గ్రూపులోని కులం.[[కటికోళ్ళు]] ...[[కసాయిలు]] ...అనికూడా వీరిని అంటారు.వాస్తవానికి వీరు కత్తిపడతారుగానీ...ఏ జంతువు ప్రాణం తీయరు.మాంసం అమ్మటం `'''ఆరె కటిక''''ల కుల వృత్తి. అది కూడా గొర్రె, మేక మాంసమే తప్ప `గో' మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే... వీరు కత్తిపడతారే తప్ప ఏ జంతువు ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి మార్కెట్‌ చేస్తారు.చేతిలో కత్తి...రక్తపు మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు.దళితుల మాది రిగానే ఈ కులస్తులు రాష్ర్టమంతటా అంటరానితనానికి గురవుతున్నా ప్రభుత్వం బిసీ-డి గానే గుర్తించింది.యస్సీలలో కలపాలని వీరి డిమాండు.మాంసం అమ్ముతారు కనుక వీరి వల్ల కాలుష్యం పెరుగుతుందనేది ఆరోపణ. ఆ దుర్గంధాన్ని భరించలేమనేదే సమాజంలోని ఇతర వర్గాల వాదన. యుపి, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాంచల్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాషా్టల్ల్రో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా....మన రాష్ట్రం మాత్రం బీసీ-డీలోనే ఉంచింది.
కల్లు దుకాణాల మూసివేతతో ఈ వృత్తిదారులు రోడ్డున పడ్డారు. పురుషులు మాంసం దుకాణాలలో ఉంటే, మహి ళలూ, పిల్లలూ కల్లుదుకాణాల్లో మేక, గొర్రెలకు సంబంధించిన పేగులు, చెవులు, కాళ్ళు, తల భాగాలతో తయారు చేసే వంటకాలు `[[బోటీ]] `[[చాగ్నా]] 'ను విక్రయిస్తారు. రక్తాన్ని ఉడకబెట్టి కారం, ఉప్పూ కలిపి కూడా అమ్ముతారు. కాలేయాన్ని ఫ్రై చేసి విక్రయించేవారు.మరికొందరు జాతర ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే సంత లకు వెళ్ళి పచ్చి మాంసం అమ్ముతుంటారు. బతుకుబండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుం బాలు కల్లు దుకాణాల మూసివేతతో ఉపాధిని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున… వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి...' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలలు రజకులకు దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.కోసిన మాంసం నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి మాంసం అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు.పెట్టుబడిఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.
==మూలాలు==
*http://www.suryaa.com/showNews.asp?category=1&subCategory=9&ContentId=4699
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు