పట్టు (సిల్క్): కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE వీడియో చేర్చాను
 
పంక్తి 1:
[[File:Meyers_b14_s0826a.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Meyers_b14_s0826a.jpg|thumb|నాలుగు ముఖ్యమైన పెంపుడు పట్టు పురుగులు. పై నుండి క్రిందికి:''[[:en:Bombyx_mori|Bombyx mori]]'', ''[[:en:Hyalophora_cecropia|Hyalophora cecropia]]'', ''[[:en:Antheraea_pernyi|Antheraea pernyi]]'', ''[[:en:Samia_cynthia|Samia cynthia]]''. From [[:en:Meyers_Konversations-Lexikon|Meyers Konversations-Lexikon]] (1885–1892)]]
సిల్క్ అనేది సహజ [[ప్రోటీన్]] దారం. ఈ దారంతో బట్టలు నేస్తారు. ఈ ప్రోటీన్ దారం ముఖ్యంగా పైబ్రోయిన్ తో తయారైనది. ఇది దారం కొన్ని పురుగుల గుడ్లనుండి తయారైన లార్వా నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ లార్వా తన చుట్టూ ఒక దారాన్ని అల్లుకుని కకూన్ ను తయారు చేసుకుంటుంది. <ref>{{cite web|url=http://www.thefreedictionary.com/silk|title=Silk|publisher=The Free Dictionary By Farlex|access-date=2012-05-23}}</ref> ముఖ్యంగా [[పట్టు పురుగు]] లార్వాలతో ఏర్పడే సిల్క్ ను ఎక్కువగా వస్త్రాల తయారీకి వాడుతున్నారు. పట్టు దారం మెరిసే రూపం పట్టు దారం త్రిభుజాకార పట్టకం లాంటి నిర్మాణం కారణంగా ఏర్పడుతుంది. పట్టు వస్త్రంలో ఉన్న ఈ పట్టకం లాంటి రూపాలలో వివిధ కోణాల్లో పతనమైన కాంతిని [[వక్రీభవనం]] చెందించడం మూలంగా మెరుపు వస్తుంది. తద్వారా వివిధ రంగులను ఉత్పత్తి చేస్తుంది.
[[File:Silk-from-Crickets-A-New-Twist-on-Spinning-pone.0030408.s003.ogv|thumb|పట్టును ఉత్పత్తి చేసే రాస్పీ క్రికెట్]]
 
పట్టు (సిల్క్) అనేక కీటకాల వల్ల ఉత్పత్తి అవుతుంది. కానీ సాధారణంగా వస్త్ర తయారీకి మాత్ గొంగళి పురుగుల పట్టు మాత్రమే ఉపయోగించబడుతుంది. అణుస్థాయిలో బేధం కలిగించే ఇతర రకాల పట్టు దారాన్ని తయారుచేయడానికి పరిశోధనలు జరిగాయి.<ref name="Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ 2010 171–88">{{cite journal|vauthors=Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ|year=2010|title=Insect silk: one name, many materials|journal=[[Annual Review of Entomology]]|volume=55|pages=171–88|doi=10.1146/annurev-ento-112408-085401|pmid=19728833}}</ref> సాధారణంగా పట్టును కీటకాల జీవన చక్రంలోని లార్వా దశలో దాని నుండి ఉత్పత్తి చేసిన దారంతో తయారుచేస్తారు. అదే విధంగా సాలెపురుగులు, రేస్పీ క్రికెట్స్ వంటి కొన్ని కీటకాలు కూడా వాటి జీవన విధానంలో పట్టును తయారుచేస్తాయి.<ref>{{cite journal|vauthors=Walker AA, Weisman S, Church JS, Merritt DJ, Mudie ST, Sutherland TD|year=2012|title=Silk from Crickets: A New Twist on Spinning|journal=PLOS ONE|volume=7|issue=2|pages=e30408|bibcode=2012PLoSO...730408W|doi=10.1371/journal.pone.0030408|pmc=3280245|pmid=22355311}}</ref> సిల్క్ ఉత్పత్తి హెమెనోప్టెరా ( తేనెటీగలు, కందిరీగలు, చీమలు), సిల్వర్ ఫిష్, మైఫైల్స్, థ్రిప్స్, లీఫ్ హోపర్స్, బీటిల్స్, లేస్ వింగ్స్, ప్లీస్, ప్లైస్, మిడ్జెస్ వంటి కీటకాలలో కూడా కనిపిస్తుంది.<ref name="Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ 2010 171–88" /> ఇతర రకాల ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు కూడా సిల్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధానంగా [[సాలెపురుగు]]<nowiki/>లు ఉత్పత్తి చేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/పట్టు_(సిల్క్)" నుండి వెలికితీశారు