బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో [[మొక్కజొన్న]]లు, [[జొన్నలు]], [[సజ్జలు]], [[మినుములు]], [[శనగలు]], పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
 
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.<ref name="Telangana Divine Festival">{{cite web|last=Indian Divine Festival|date=4 October 2013|title=Bathukamma Festival (Panduga)|url=http://populartourismplaces.blogspot.in/2012/10/telengana-divine-festival-bathukamma.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131004221029/http://populartourismplaces.blogspot.in/2012/10/telengana-divine-festival-bathukamma.html|archive-date=4 October 2013|website=|accessdate=19 October 2012}}</ref>
last='''Indian Divine Festival'''|
title='''Bathukamma Festival(Panduga)'''|
url=http://populartourismplaces.blogspot.in/2012/10/telengana-divine-festival-bathukamma.html|
accessdate=19 October 2012|
website=|
archive-url=https://web.archive.org/web/20131004221029/http://populartourismplaces.blogspot.in/2012/10/telengana-divine-festival-bathukamma.html|
archive-date=4 అక్టోబర్ 2013|
url-status=dead}}</ref>.
 
అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి [[తంగేడు]], గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు