సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
 
పంక్తి 48:
 
== చరిత్ర ==
1969 లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. శ్రీహరికోట పేరు మీదుగా దానికి SHAR అని [[విక్రం సారాభాయ్]] నామకరణం చేశాడు.<ref name="isro">{{Cite book|url=https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|title=From Fishing Hamlet to Red Planet: India's Space Journey|editor1-last=Rao|editor1-first=P. V. Manoranjan|editor2=B. N. Suresh|editor3=V. P. Balagangadharan|publisher=Harper Collins|year=2015|isbn=9789351776901|location=India|pages=328|language=en|chapter=4.1 The Spaceport of ISRO - K. Narayana|quote= ఈ కేంద్రానికి విక్రం సారాభాయ్ షార్ (SHAR - శ్రీహరికోట రేంజ్ అనే పేరుకు సంక్షిప్త రూపం) అని నామకరణం చేశాడు. చాలా మంది దీన్ని శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ అని తప్పుగా భావించారు. సంక్షిప్త రూపాన్ని '''శర్''' అని పలికితే బాణం అనే అర్థం కూడా వస్తుంది. బాణాన్ని ఎక్కుపెట్టినట్టు రాకెట్ ఎక్కుపెట్టడం అనే అర్థం కూడా వస్తుంది.|access-date=2022-03-22|archive-date=2022-03-08|archive-url=https://web.archive.org/web/20220308184429/https://www.isro.gov.in/pslv-c25-mars-orbiter-mission/fishing-hamlet-to-red-planet-download-e-book|url-status=dead}}</ref> 1971 అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి.<ref>{{cite web |url=http://www.astronautix.com/r/rh-125.html |title=RH-125 |publisher=[[Encyclopedia Astronautica]]|access-date=2022-03-25}}</ref> 1969-1979 మధ్యలో ఈ కేంద్రంలో ఉపగ్రహ ప్రయోగం చేసేముందు జరపవలసిన పరీక్షలు చేసేందుకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందింది. ఇంకా అక్కడ పనిచేసే ఉద్యోగులకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలైన ఇళ్ళు, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవంతా అభివృద్ధి చేశారు. అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]{{ZWNJ}}తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం 2002 సెప్టెంబరు 5న '''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్'''గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచి ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణం లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.