పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: వర్గం మార్పు
కొంత విస్తరణ
పంక్తి 1:
'''పింగళి దశరధరామ్''', [[హేతువాది]], పత్రికా సంపాదకుడు. దశరధరామ్ తన స్వీయ సంపాదకత్వంలో [[విజయవాడ]] సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపే వాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపీలతో మొదలు పెట్టబడింది. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌంటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట. దాదాపు 5 లక్షల కాపీలవరకు అమ్ముడు పోయేదని చెప్పుకుంటారు.
 
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం (విజయవాడ)]] లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>http://www.dailyexcelsior.com/02aug01/national.htm</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది.
 
దశరధరామ్ యువతరం గురించీ ఎన్నో కలలు కన్నాడు. భగత్ సింగ్ ను "బాంబులతో బంతెఉలాడుకొన్న జాతి హీరో" అని ప్రశసించి అతని స్ఫూర్తితో యువతరం ధైర్యంగా, నిజాయితీగా ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని ఆశించేవాడు. సినిమా అభిమాన సంఘాల్లో, ఇతరేతర వ్యాపకాల్లో మునిగి ఉన్న వాళ్ళను తీవ్రంగా విమర్శించేవాడు ("ఉరేయ్ ! ఇకనైనా కళ్ళు తెరవండ్రా!"). కమ్యూనిజం పట్ల వ్యతిరేకత, ఆర్.ఎస్.ఎస్ పట్ల మరింత వ్యతిరేకత ఉండేవి. "దేశ విద్రోహక ఆరెస్సెస్" అని ఒక పుస్తకం కూడా రాసాడు. అలాగే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం వ్రాశాడు. రాజకీయ నాయకుల్లో ఒక జయప్రకాష్ నారాయణను తప్ప మరెవరినీ గౌరవించలేదు.
 
==రచనలు==
ఇతను తన పత్రిక నడపటమే కాక కొన్ని రచనలు కూడ చేసినట్టు తెలుస్తుంది. అతని రచనలో కొన్ని:
# కమ్యూనిస్టు దేశాల్లో మతమౌఢ్యం 1982
# మతం+మనిషి=అజ్ఞాని 1982
# విషసంస్కృతిలో స్త్రీ 1982
# ముమ్మిడివరం బాలయోగి బండారం 1983
# స్వేచ్చ అంటే ఏమిటి? 1983
# బాబాలు-అమ్మలు 1983
# దేశ విద్రోహక ఆరెస్సెస్
# కృష్ణా-క్రీస్తు ఒకడేనా?
 
==మూలాలు==
Line 17 ⟶ 20:
 
[[వర్గం:పాత్రికేయులు]]
[[వర్గం:1985 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు