అగ్నిధార: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
#WPWPTE
పంక్తి 28:
'''అగ్నిధార''' పుస్తకం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం.
== రచన నేపథ్యం ==
[[దస్త్రం:అగ్నిధార.jpg|thumb]]
అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. [[దేవులపల్లి రామానుజరావు]], [[పులిజాల హనుమంతరావు]]లు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. [[దాశరథి కృష్ణమాచార్య]] [[నిజాం]] నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి [[నిజాం]] ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు. [[అగ్నిధార]]లోని ఖండికల్లో చాలావరకూ ఆ జైలు జీవితంలోనూ, జైలులో నుంచి బయటపడ్డ కొత్తల్లోనూ రాసినవి. [[నిజాం]] రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం - ఈ ఘటనలు తన ఈ రచనకు [[పునాదులు]]గా కృష్ణమాచార్య పేర్కొన్నారు. యువకునిగా ఉండగా తాను రచించిన కవిత్వం కావడంతో ఈ కవితా ఖండికల్లో శృంగారం కూడా చోటుచేసుకున్నట్టు, యుద్ధారావాలతోపాటుగా [[శృంగార]] రచనలు చేయడం తన రచనకున్న రెండు లక్షణాలు అంటూ దాశరథి కృష్ణమాచార్య అన్నారు.<ref>పురాస్మృతులు(వ్యాసం):దాశరథి:26-1-1963</ref>
 
"https://te.wikipedia.org/wiki/అగ్నిధార" నుండి వెలికితీశారు