రేలంగి వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
రేలంగిగా పేరు తెలిసిన రేలంగి వెంకట్రామయ్య [[పద్మశ్రీ]] అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.
{{మొలక}}
==బాల్యం==
'''రేలంగి వెంకట్రామయ్య''' [[రావులపాడు]]లో [[1910]] సంవత్సరం [[ఆగష్టు 9]]వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, హాస్యనటులలో పేరెన్నికగన్నవారు. ఇంటిపేరు రేలంగితో ప్రసిద్ది పొందారు. 50 మరియు 60 దశకాలలో రేలంగి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. [[మాయాబజార్]] (లక్ష్మణకుమారుడు), [[నర్తనశాల]] (ఉత్తరకుమారుడు) [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]], [[మిస్సమ్మ]] చిత్రాలలో రేలంగి నటన చిరస్మరణీయం. భారత ప్రభుత్వం ఆయనను ''పద్మశ్రీ'' అవార్డుతో గౌరవించింది.
రేలంగి వెంకట్రామయ్య [[రావులపాడు]]లో [[1910]] [[ఆగష్టు 9]]వ తేదీన జన్మించారు. రేలంగి తండ్రి హరికథలు , సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. [[1919]]లో 'బృహన్నల ' అనే నాటకంలో స్రీ పాత్రతో మొదటిసారి నటించాడు. [[ఎస్వీ రంగారావు]], [[అంజలీదేవి]] మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు.
==సినీ రంగ ప్రవేశం==
[[1931]]లో విడుదలయిన [[భక్త ప్రహ్లాద]]' చిత్రం చూసి తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకొని [[కలకత్తా]] చేరుకున్నాడు. అక్కడ [[సి.పుల్లయ్య]] నిర్మిస్తున్న [[శ్రీకృష్ణ తులాభారం]]లో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం లభించింది. తర్వాత [[వరవిక్రయం]], [[గొల్లభామ]] మొదలయిన చిత్రాలలోని వేషాలతో పాటు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దాదాపు పన్నెడేళ్ళ తర్వాత [[గుణసుందరి కథ]] చిత్రలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతులు, మరిన్ని అవకాశాలు తీసుకువచ్చింది.
==విజయాలు==
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యముగా [[మిస్సమ్మ]], [[మాయాబజార్]], [[దొంగరాముడు]], [[వెలుగునీడలు]], [[విప్రనారాయణ]], [[నర్తనశాల]], [[అప్పు చేసి పప్పు కూడు]] మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడి సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి.
రేలంగి పోషించిన కొన్ని పాత్రలు:
 
*[[నర్తనశాల]]లో - ఉత్తరకుమారుడు
*[[మాయాబజార్]]లో - లక్ష్మణకుమారుడు
*[[సత్య హరిశ్చంద్ర]]లో - నక్షత్రకుడు
*[[లవకుశ]]లో - రజకుడు
*[[జయభేరి]]లో - లచ్చన్న బంగారయ్య
*[[జగదేకవీరుడు]]లో - రెండు చితలు
*[[సువర్ణ సుందరి]]లో - కైలాసం
*[[ప్రేమించి చూడు (1965 సినిమా)| ప్రేమించి చూడు]]లో - బుచ్చబ్బాయ్
*[[వెలుగునీడలు]]లో - వెంగళప్ప
*[[అప్పుచేసి పప్పుకూడు]]లో - భజగోవిందం
*[[మిస్సమ్మ]]లో - దేవయ్య
 
రేలంగి సరసన [[సూర్యకాంతం]], [[గిరిజ]] ఎక్కువ నటిచారు.
రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. 'వినవే బాల నా ప్రేమ గోల ' 'కాశీకి పోదాము రామా హరీ ' 'సరదా సరదా సిగిరెట్టు ' వంటి రేలంగి పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
నిర్మాతగా రేలంగి [[సామ్రాజ్యం]] అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు [[రాజబాబు]]కు మొదటి చిత్రం.
 
==గొప్పదనం==
రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యాన్నదానములు జరిగేవి.
[[పద్మశ్రీ]] అవార్డు పొందిన మొదటి హాస్యనటుడయిన రేలంగి [[1975]] [[నవంబరు 26]] న కన్నుమూశాడు.
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]