ముట్నూరి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[బొమ్మ:MuTnUri kRshNaa raavu.jpg|right|150px|ముట్నూరి కృష్ణారావు ]]
[[బొమ్మ:MuTnUri kRshNaaraavu text.jpg|right|150px|ముట్నూరి కృష్ణారావు ]]
'''ముట్నూరి కృష్ణారావు''' ([[1879]] - [[1945]]) ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, [[కృష్ణా పత్రిక]] సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.
 
కృష్ణారావు 1879లో జన్మించాడు. ఈయన పుట్టగానే తల్లి గతించింది. బాల్యంలోనే తండ్రి పరిమపదించడం వళ్ల పినతండ్రి ప్రాపకములో పెరిగాడు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసం [[బందరు]]లోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ కోర్సులో చేరాడు. ఇక్కడే ఈయనకు [[రఘుపతి వెంకటరత్నంనాయుడు]] యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజములో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్ధిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రికనుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించాడు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశాడు.