నూతి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: అక్టోబర్‌ → అక్టోబరు, భారత దేశం → భారతదేశం, లో → లో , → (8), , → ,
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
 
పంక్తి 2:
 
== జననం ==
నూతి శంకరరావు [[1930]], [[ఫిబ్రవరి 13]]న [[మెదక్ జిల్లా]], టెక్మల్‌లో జన్మించాడు. అతను 1942లో కేశవ్‌ మెమోరియల్‌ పాఠశాలలో 5వతరగతి చదివేందుకు హైదరాబాదు వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 12 సంవత్సరాలు. ఉత్తరభారతదేశం నుంచి ఆర్యసమాజ ప్రచారకులు తరచుగా ఆ పాఠశాలకు వచ్చి [[స్వామి దయానంద సరస్వతి|దయానంద సరస్వతి]] ఉపన్యాసాలను బోధించేవారు. పండిత నరేంధ్ర జీ వంటి వారి ఉపన్యాసాలు అతని లాంటి ఎంతో మందిని ప్రభావితం చేశాయి. నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రతువులో [[ఆర్యసమాజ్]]‌ ముఖ్య పాత్ర పోషించింది. 1947 అక్టోబరులో [[స్వామి రామానంద తీర్థ]] హైదరాబాద్‌ను స్వతంత్య్ర భారతలో విలీనం చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు కోర్టులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు ఉత్తేజితులలైన కార్యకర్తలు [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి|బి. సత్యనారాయణరెడ్డి]], బల్వంతరెడ్డి, మహదేవ్‌సింగ్‌తో పాటు బంద్‌కు పిలుపిచ్చారు.. 60మంది విద్యార్థులు కలిసి సుల్తాన్‌ బజార్‌లో నిత్యం 6నెలల పాటు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-198833|website=m.andhrajyothy.com|access-date=2020-06-06|title=ఆర్కైవ్ నకలు|archive-date=2020-06-06|archive-url=https://web.archive.org/web/20200606110109/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-198833|url-status=dead}}</ref> ఈ సత్యగ్రహ కార్యక్రమాలు చేసిన ఆ 6నెలలు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లోనే అందరూ నివాసం ఉన్నారు. బయట ఉంటే పోలీసుల వారిని అనుమానిస్తారని భావించి, [[రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి|రాజా బహదూర్‌ వెంకటరామిరెడ్డి]]ని కలిసి వారి వసతిగృహంలో ఉండేందుకు అనుమతి కోరారు. అందుకు అంగీకరించిన అతను " మీ కార్యక్రమాలు మీరు చేయండి కానీ, పోలీసులకు మాత్రం నా పేరు చెప్పకండి" అని నవ్వుతూ అన్నాడు. ప్రతి రోజూ నిరసన ర్యాలీలు, నినాదాలతో [[సుల్తాన్‌బజార్]]‌ మారుమోగుతుండేది. పోలీసులకు దొరక్కుండా వారు చేసిన కార్యక్రమ సమాచారాన్ని సికింద్రాబాద్‌లోని డెక్కన్‌క్రానికల్‌ ఆంగ్ల పత్రిక కార్యాలయానికి అందించేందుకు రాత్రి 8గంటల ప్రాంతంలో రోజుకొకరు చొప్పున మారువేషాల్లో వెళ్లేవారు. అలా అతకసారి యాచకుడి వేషంలో వెళ్లాడు.
 
== ప్రభాత భేరి ==
"https://te.wikipedia.org/wiki/నూతి_శంకరరావు" నుండి వెలికితీశారు