నీలము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ...==
[[Image:Skyshot.jpg|thumb|250px200px|right|[[విమానం]] నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.]]
ఈ రకం [[రంగు]] ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే [[కాంతి]] ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. [[గాలి]]లో అనేకమైన [[అణువు]]లు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి [[ఆమ్లజని]], [[నత్రజని]] అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, [[నీరు|నీటి]] ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు [[సూర్యుడు|సూర్యుడి]] దగ్గనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి [[ఇంద్రధనుస్సు]]లో [[తరంగ దైర్ఘ్యం]] (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది.
 
 
 
సూర్యుడు [[ఆకాశం]]లో కిందకి ఉన్నప్పుడు (అంటే ఉదయం, సాయంకాలం), సూర్య కిరణాలు [[భూమి]] వాతావరణం లో చాల దూరం ప్రయాణం చేస్తే కాని మన కంటిని చేరలేవు. కనుక కిరణాలలోని రంగులు విరజిమ్మబడటానికి సావకాశాలు ఎక్కువ. కనుక నీలి రంగు ఎక్కువగా ఇటు, అటూ చెదిరి పోతుంది, కాని [[ఎరుపు]] తక్కువ చెదురుతుంది కనుక తిన్నగా మన కంటిని చేరుకుంటుంది. అందుకనే సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. మన పల్లెపట్టూళ్ళలో గోధూళి వేళ గాలిలోకి బాగా దుమ్ము రేగుతుంది. కనుక గోధూళి వేళ ఆకాశం ఎర్రగా ఉంటుంది. సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు కిరణాలు మన వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. కనుక సాయంత్రం కంటె ఎక్కువ నీలి రంగు మన కంటిని చేరుతుంది. అందుకని మధ్యాహ్నం ఆకాశం నీలిగా కనబడుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/నీలము" నుండి వెలికితీశారు