"రామానుజాచార్యుడు" కూర్పుల మధ్య తేడాలు

 
==జన్మవృత్తాంతం==
 
రామానుజాచార్యుడు మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరంబదూరులో ఒక వైదిక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శ్రీమాన్ ఆసూరి సర్వాకృతు కేశవ సోమయాజి దీక్షితార్ మరియు శ్రీమతి కాంతిమతి. జన్మించిన శిశువు తేజస్సును చూసి అచ్చెరువొందిన మామ, పెరియ తిరుమల నంబి, ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, ఇళయ పెరుమాళ్ అనే నామధేయాన్ని నిర్ధారిస్తారు <ref>Ramaswamy, Anbil, "Ramanuja Acharya's Life History", http://www.saranagathi.org/acharyas/ramanuja/articles/life.php Accessed on 03.01.2009</ref>.
== జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు ==
 
మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరంబదూరులో శ్రీమాన్ ఆసూరి 'సర్వాక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిని అన్ని యఙాలనూ పూర్తిచేసి 'సర్వాక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో, భార్య కాంతిమతితో కలసి, తిరివల్లికేని (ట్రిప్లికేన్) ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యఙాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబదూరును వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యులు.<ref> Pramod Kumar M, "Life of Sri Ramanujacharya - Part 2", http://living.oneindia.in/yoga-spirituality/vedanta/ramanujacharya-part-ii.html, Accessed on 03.01.2009</ref><br />
 
'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం, చైత్ర మాసం, తిరువాదిరై రాశి, శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ క్రీ.శ. 1017, ఏప్రిల్ 13.<ref>Ramaswamy, Anbil, "Ramanuja Acharya's Life History", http://www.saranagathi.org/acharyas/ramanuja/articles/life.php Accessed on 03.01.2009</ref>. శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ ఐన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు),ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, ఇళయ పెరుమాళ్ అనే నామధేయాన్ని నిర్ధారిస్తారు. <ref>Pramod Kumar, Op.Cit.,</ref> <ref> Ramaswamy, Anbil, Op.Cit.,</ref> శిశువు శరీరంపైనున్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్‌మోళ్హి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.<ref> Pramod Kumar, Op.Cit.,</ref>
 
 
 
100

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/371619" నుండి వెలికితీశారు