తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

→‎వనరులు: చెత్త తొలగింపు
ట్యాగు: 2017 source edit
india warngal ts telugu ts india
పంక్తి 1:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|right|తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా]]
[[దస్త్రం:3rd century-ikshwaku inscription.jpg|thumb|250px|right|3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం]]
'''తెలుగు''' అనేది [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషల]] కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే [[తెలుగు ప్రజలు|ప్రజలు]] ప్రధానంగా [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్ర]], [[తెలంగాణ|తెలంగాణాలో]] ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో [[అధికార భాష]]. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో [[హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీలతో]] పాటు ఇది కూడా ఉంది. [[పుదుచ్చేరి|పుదుచ్చేరిలోని]] [[యానాం|యానం]] జిల్లాలో తెలుగు అధికారిక భాష. [[ఒడిషా|ఒడిశా]], [[కర్ణాటక]], [[తమిళనాడు]], [[కేరళ]], [[పంజాబ్ ప్రాంతం|పంజాబ్]], [[ఛత్తీస్‌గఢ్]], [[మహారాష్ట్ర]], [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్ దీవులలో]] గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం [[భారతదేశ అధికారిక భాషలు|భారతదేశ ప్రాచీన భాషగా]] గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.
 
భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 82 మిలియన్ల మంది మాట్లాడేవారున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది. [[ద్రావిడ భాషలు|ఇది ద్రావిడ భాషా కుటుంబంలో]] ఎక్కువమంది మాట్లాడే భాష. భారతదేశంలో [[భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు|ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో]] ఇది ఒకటి. ఇది [[అమెరికా|అమెరికాలో]] వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష. తెలుగు భాషలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. కన్నడిగుడైన [[శ్రీకృష్ణదేవరాయలు]] తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని వ్యవహరించాడు. [[కన్నడ]], తెలుగు అక్షరమాలలు చాలా వరకు పోలికగలిగి వుంటాయి
 
'''తెలుగు లిపి''' ఇతర భారతీయ భాష లిపుల లాగే ప్రాచీన దక్షిణ [[బ్రాహ్మీ లిపి]]నుండి ఉద్భవించింది<ref>తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070926090446/http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf |date=2007-09-26 }}</ref>. [[అశోకుడు|అశోకుని]] కాలంలో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట [[భట్టిప్రోలు]]లో దొరికాయి. అక్కడి బౌద్ధ స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్య కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి<ref>ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070930085421/http://www.buddhavihara.in/ancient.htm |date=2007-09-30 }}</ref>. ఈ లిపిని భాషాకారులు [[భట్టిప్రోలు లిపి]] అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి<ref>The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070326232530/http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm |date=2007-03-26 }}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు