వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:yvrao.jpg|frame|వై.వి.రావు]]
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') (జ: [[1903మే 30]], [[మే 301903]] - మ: [[ఫిబ్రవరి 14]], [[1973]]) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.
 
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]] లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన ''సతీ సులోచన'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె, మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. తెలుగు సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు