ఆలూరి బైరాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[హేతువాది]].తెనాలి ఐతానగరంలో5.11.1925 జననం.సరస్వతి, వెంకట్రాయుడు తల్లిదండ్రులు.1935 ప్రాంతాల్లో [[యలమంచిలి వెకటప్పయ్య ]] స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనోఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.యం.యన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. ఇంగ్లిషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా పత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. ఆయన మొదటి కవితా సంకలనం ''చీకటి నీడలు'' ప్రచురించారు. బైరాగి పినతండ్రి అయిన చక్రపాణి హిందీ చందమామకు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. ''పలాయన్'' హిందీ కవితా సంకలనం ప్రచురించారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి 'చందమామ'లో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు.నూతిలో కప్పలు, ''దివ్యభవనం'' కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు.1978లో క్షయవ్యాధికి గురయ్యారు. మిత్రులు ఎంత బతిమాలినా వైద్యంపట్ల ఆసక్తి చూపలేదు. చివరిరోజుల్లో ఆయన తన మకాం హైదరాబాద్‌కు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ బాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీలో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం.1978 సెప్టెంబర్ 9నమరణించారు.
*బైరాగి- ''మబ్బుల్లో పసిపాపల నవ్వు''లను చూడగలిగారు. ''కొండలపై కులికే కిరణాల''కు మురిసిపోగలిగారు. ''అడవులలో వికసించే నవ్వు''లకు పరవశించగలిగారు. ''బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం'' -[[ నార్ల వెంకటేశ్వరరావు]]
==కవితలు==
*ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య-ప్రేమలు పొసగవు
ఈ బండరాళ్ళపైన-ఏ మొక్కలూ ఎదగవు
జీవిత ప్రభంజనం-కలయిక సహించదు-
ఉన్న గడువు కొద్ది ----– చీకటి నీడలు
"https://te.wikipedia.org/wiki/ఆలూరి_బైరాగి" నుండి వెలికితీశారు