1.* హిందూ సైన్యములో వేగముగా కదలు అశ్వములు తక్కువ. మెల్లగా కదలు ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజముగా సుల్తానులకు లాభించింది.
2.* సుల్తానుల సేనాధిపతులు యవ్వనవంతులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు. వృద్ధుడైన రామరాయలుతో సహా.
3.* హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగముగా గురి తప్పకుండా ఛేదిస్తాయి.
4.* విజయనగరరవిజయనగర సైనికుల వద్ద ఏదుఏడు అడుగుల బల్లెములు, ఈటెలున్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లెములున్నాయి.
5.* సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకుధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
6.* అన్నింటికన్నా ముఖ్య కారణము: వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతములో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు యుద్ధరంగమును సరైన సమయములో వదలి పోవుట <ref>History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73 </ref>.