ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సిల్క్ స్మిత నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
== నిర్మాణం, అభివృద్ధి ==
ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత [[శివలెంక కృష్ణప్రసాద్]] తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు [[పి.సి.శ్రీరామ్|పి. సి. శ్రీరాం]] ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.<ref name="ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?">{{cite news |last1=Sakshi |title=ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా? |url=https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |accessdate=18 July 2021 |work= |date=18 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210718183324/https://www.sakshi.com/telugu-news/movies/balakrishna-aditya-369-movie-completed-30-years-1379635 |archivedate=18 July 2021 |language=te |url-status=live }}</ref>
 
మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’"/>
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు