సి.ఆర్.సుబ్బరామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సి.ఆర్.సుబ్బరామన్''' లేదా '''సి.ఆర్.సుబ్బురామన్''' ([[1921]] - [[1952]]) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా [[హార్మోనియం]] వాద్యంలో నిపుణత పొంరి హెచ్.ఎం.వి. మ్యూజిక్ సంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానో లో కూడా పట్టు సాధించారు.

1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో [[చిన్నయ్య]] మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన [[ఎస్.రాజేశ్వరరావు]] తప్పుకోవడం జరిగింది. దానితో [[సముద్రాల రాఘవాచార్య]] గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.
 
తరువాత తెలుగులో విడుదలైన [[రత్నమాల]] చిత్రానికి సంగీతం చేకూర్చి మధురమైన బాణీలతో అందరినీ అలరించారు. ఈ చిత్రంలో [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారు వీరి వద్ద సహాయకులుగా చేరారు. [[లైలా మజ్ను]] చిత్రం వీరిని ఆకాశానికెత్తింది. ఆ చిత్రానికి అరేబియన్ సంగీత పోకడలను ప్రవేశపెట్టారు. అలాగే పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి తెలుగు తెరకు నూతన వరవడిని దిద్దారు.
 
1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపుసగా పేర్కొనబడే [[దేవదాసు]] చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/సి.ఆర్.సుబ్బరామన్" నుండి వెలికితీశారు