సంకీర్తన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాళ్ళపల్లి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
producer =ఎం.గంగయ్య|
image = Sankeerthana.jpg |
director =[[గీతాకృష్ణగీతా కృష్ణ]]|
music director =[[ఇళయరాజా]]|
year =1987|
పంక్తి 12:
editing = [[అనిల్ మల్నాడ్]] |
}}
'''సంకీర్తన''' కోణార్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై [[అక్కినేని నాగార్జున]], [[రమ్యకృష్ణ]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రల్లో నటించగా [[గీతా కృష్ణ|గీతాకృష్ణ]] దర్శకత్వం వహించిన 1987నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
ఓ పల్లెటూళ్ళో జాలరి కులానికి చెందిన కాశీ (అక్కినేని నాగార్జున) అజ్ఞాత కవి, గాయకుడు. కాశిలోని ప్రతిభ పెద్దగా ఎవరకీ తెలియదు. తల్లి (డబ్బింగ్ జానకి) జాలరిగా పనిచేస్తూంటుంది. పెద్ద కులానికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ)ని నిజానికి పిల్లలు లేని వాసుదేవ మూర్తి (జె.వి.సోమయాజులు) గుడిమెట్లపై దొరికితే తెచ్చుకుని పెంచుకుంటూంటాడు. కానీ కీర్తన తమ సొంత కూతురు కాకపోవడంతో వాసుదేవమూర్తి భార్యకు ఆమెపై అక్కసు, వ్యతిరేకత ఉంటుంది. ఇదిలావుండగా ఆ ఊరి జనం దేవతలా భావించి కొలుస్తూ ఉంటారు. ఆమె అడుగుపెట్టాకే తమ కడగళ్ళు పోయాయని, గ్రామం సుభిక్షమైందని నమ్ముతూంటారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలో కీర్తన నాట్యం చేస్తూంటుంది, ఆమెకు నాట్యశాస్త్ర గురువు పరమేశ్వరశాస్త్రి (గిరీష్ కర్నాడ్). అలాంటి ఓ సంవత్సరపు నృత్యప్రదర్శనలో ఆమెను చూసిన కాశికి అప్పటి నుంచి కవితలకు ఆమే ప్రేరణగా మారిపోయే స్థితి వచ్చేస్తుంది. ఆమె అతని కవితా దేవతగా భావించుకుంటాడు. కాశీ స్నేహితులైన ముగ్గురు చిన్న పిల్లలు, గోదారి (రాళ్ళపల్లి)ల ద్వారా ఆ కవితలు చూసి చదివిన కీర్తనలో కాశీ పట్ల ప్రేమ అంకురిస్తుంది. ఆ గ్రామంలోకెల్లా సంపన్నులైనవారి కొడుకు శ్రావణ్ (శరత్ బాబు) చదువు ముగించుకుని ఊళ్ళోకి వస్తాడు. అతను మంచి చిత్రకారుడు, కీర్తన నాట్యం చూసి ఆమె పట్ల ప్రేమ పెంచుకున్నా కీర్తనకి కాశీ పట్ల ఉన్న ప్రేమ గురించి తెలుసుకుని తన ఆలోచనలు వదులుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/సంకీర్తన_(సినిమా)" నుండి వెలికితీశారు