టి.ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 36:
}}
 
'''టి.ఎల్.వి.ప్రసాద్''' భారతీయ సినిమా దర్శకుడు, [[రచయిత]], [[నిర్మాత]]. ఇతడు సినిమా దర్శకుడు [[తాతినేని ప్రకాశరావు]] కుమారుడు. ఇతడు [[తెలుగు]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీ]], [[మరాఠీ భాష|మరాఠి]] చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1952]], [[మార్చి 21]]వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు [[విజయవాడ]]లో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో [[కుడి ఎడమైతే]] చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ]], [[మోహన్ బాబు]] వంటి నటులతో పనిచేశాడు. 1992లో [[మిథున్ చక్రవర్తి]] హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/టి.ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు