అతడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పద్మాలయా స్టూడియోస్ లో [[త్రివిక్రం శ్రీనివాస్]] అతడు సినిమా కథను మహేష్ బాబుకి వివరించారు. విన్నాక ఆ కథ నచ్చి మహేష్ తన తండ్రి, పద్మాలయా స్టూడియోస్ అధినేత, నటుడు కృష్ణకు కూడా వివరించారు. ఆయనకు కూడా సినిమా నచ్చడంతో పద్మాలయా పతాకంపైనే సినిమా తీద్దామని వారు భావించారు. అప్పటికి త్రివిక్రం [[నువ్వే నువ్వే]] సినిమాకు దర్శకత్వం వహిస్తూండగా, [[మహేష్ బాబు]] టక్కరి దొంగ సినిమా చేస్తున్నారు. అయితే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడు కాక ముందే ఆయన ప్రతిభ గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, [[నిర్మాత]] [[మాగంటి మురళీమోహన్]] తన [[జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్]] పతాకంపై ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కాకుంటే అంతకుముందే స్రవంతి రవికిషోర్ కు ఒప్పుకోవడంతో త్రివిక్రం రెండవ సినిమా జయభేరి పతాకంపై చేస్తానని మాటయిచ్చారు. అదే విషయాన్ని మహేష్ బాబుకు చెప్పి, ఈ సినిమా జయభేరి సంస్థలో తీద్దామనడంతో అలాగే ఆలోచించి చూద్దామని చెప్పారు.<br />ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకునిగా తొలి సినిమా నువ్వే నువ్వే పూర్తిచేశారు. రచయితగా [[విజయ భాస్కర్]], [[చిరంజీవి]] కాంబినేషన్లో [[జై చిరంజీవ]]కు కథ-చిత్రానువాదం-మాటలు రాసి ఇచ్చారు. మహేష్ కథానాయకునిగా [[టక్కరి దొంగ]], [[బాబి]], [[ఒక్కడు]], [[నిజం (సినిమా)|నిజం]] సినిమాలు పూర్తిచేశారు. [[నాని]], [[అర్జున్ (2004 సినిమా)|అర్జున్]] సినిమాలు షూటింగ్ సాగుతూండగా మహేష్, త్రివిక్రమ్ ని ఈ సినిమా విషయమై తిరిగి సంప్రదించారు. దాంతో సినిమాను మహేష్ ఒకే చేసిన 3 సంవత్సరాలకు ప్రారంభించారు.<br />జయభేరి ప్రొడక్షన్స్ ఆఫీసులో సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యకలాపాలు పూర్తిచేశారు.<ref name="story behind movie">{{cite journal |last1= పులగం |first1= చిన్నారాయణ |year= 2015 |title= పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం |journal= ఫన్ డే (సాక్షి ఆదివారం)|volume= |issue= |pages= |publisher= |doi= |url= http://www.sakshi.com/news/funday/athadu-movie-story-behind-film-13-269316|accessdate= 2015-08-23}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో మొదట కథానాయకుని పాత్ర [[పవన్ కళ్యాణ్]]తో చేయిద్దామని త్రివిక్రమ్ భావించారు. అందుకు అనుగుణంగా ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించేసరికి ఓ అరగంట గడవడంతోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. అలా పవన్ కి కథ నచ్చకపోవడంతో ఆయన చేయలేదు. తర్వాత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి నటించారు. కథానాయిక పాత్రను అప్పటికి [[వర్షం (సినిమా)|వర్షం]] సినిమాతో మంచి విజయం అందుకున్న [[త్రిష]]కి ఇచ్చారు.<ref name="story behind movie" /> ఇక సినిమాలోని 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అన్న ముఖ్యమైన పాత్ర గతకాలం నాటి కథానాయకుడు, అప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్న [[శోభన్ బాబు]]తో చేయించాలని నిర్మాత [[మాగంటి మురళీమోహన్]] ఆశించారు. అందుకోసం ఆయనకు బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. అయితే తిరిగి నటించనని శోభన్ బాబు నిరాకరించారు.
"https://te.wikipedia.org/wiki/అతడు_(సినిమా)" నుండి వెలికితీశారు