లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hu:Bandzsárák
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లంబాడీ'''లనే లంబాడ, బంజారాలు, సుగాలీలు, నాయక్‌లు అని కూడా అంటారు. లంబాడీలు, [[తెలంగాణా]]లోని బంజారాలు వెనుకబడిన తరగతులు కాగా ఏజెన్సీ ఏరియాలోని [[నాయక్]] లు [[షెడ్యూల్డ్ తెగ]] . అందువలన వీళ్ళంతా నాయక్ పేరుతో ఏకమౌతున్నారు. [[పట్నాయక్]] లు వీరినుంచి చీలి కొన్ని ప్రాంతాలలో అగ్రకులస్తులుగా మారారని ఒక వాదన. [[హైదరాబాదు]]లోని [[బంజారా హిల్స్]] వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను [[తండా]] లు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష, [[రాజస్థానీ]] ఉపశాఖకు చెందిన [[ఇండో-ఆర్యన్ భాష]].<ref>http://www.ethnologue.com/show_language.asp?code=lmn</ref> [[సవర భాష]] దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలో వీరు సాంఘికంగా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నారు. 1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు.
లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ద సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
 
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
గోత్రాలు : లంబాడీలు పెళ్ళిలో ప్రప్రధమంగా గోత్రాలను పరిశీలిస్తారు. కొన్ని గోత్రాల వారు మరికొన్ని గోత్రాల వారితో వియ్యమందు కోకూడదనే నిషేధాలున్నాయి.
భరోపురాకరేర్: లంబాడీలలో కన్యాశుల్కం ఇవ్వడం ఆచారం. కన్యకు, ఆమె తల్లిదండ్రులకు వరుడు పశువులను, ధాన్యాన్ని కన్యా శుల్కంగా అర్పించుకుంటాడు. దీనినే లంబాడీలు ‘‌’ అంటారు. వధువు తల్లిదండ్రులకు నాల్గు కోడెలు 45 రూపాయలు ఇచ్చుకుంటారు. వధువుకు ఆమె తల్లిదండ్రులు కూడా పరికిణి, కాంచళి (రవిక) మొదలైన దుస్తులను, ముక్కెరను రూపాయల దండను, ఒక తాంగిడిని ఇస్తారు. తాంగిడి అంటే పెళ్ళిలో పుట్టింటివారు పెళ్ళి కూతురికి ఇచ్చే గోనె సంచి. పశువుల రూపంలో కన్యాశుల్కాన్ని సమర్పించి పెళ్ళి చేసుకొనే ఆచారం వుంది.
వరుని దేహ దారుఢ్య పరీక్ష : వరుని దేహ దారుఢ్యాన్ని, సహనాన్ని పరీక్షించటానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. స్త్రీలు జిలేడు, మోదుగు కర్రెలతో,రోకళ్ళతో కొడుతూ మా కుతురిని బాధిస్తావా? బూతు మాటలు మాట్లాడుతావా? అంటూ ప్రశ్నిస్తారు. బావ మరుదులు చిన్నచిన్న రాళ్ళు చెవి దొప్పలో పెట్టి మా అమ్మ నాన్నని తిడుతావా? మా చెల్లిని బాధిస్తావా అంటూ నలుపుతారు. ఎంత కొట్టినా, ఎంత నలిపినా అ నొప్పి అని నోట మాట రాకూడదు.వీటిని బట్టి వరుని శరీర పటుత్వాన్ని ఓర్చుకొనే శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలను భరించినవాడే వధువుకు సరియైన భర్తగా పోషించే సమర్థుడని నమ్ముతారు.
ఢావలో : పెళ్ళికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమములో మూడు విధానాలుంటాయి. ఏడ్పును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకొని ఏడ్వటం, మళేరో అని ఎద్దుపై నిల్చొని తన పుట్టింటి వారు సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ పాడేపాటను దావేలి అని అంటారు. ఢావలో ఎంత కఠిన హృదయులనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింటిలో తన బాల్యాన్ని తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలచుకొని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంట నీరు పెట్టిస్తుంది. ఆడపుట్టుక పుట్టిన తరువాత అత్తవారింటికి వెళ్లవలసిందే అని వధువు నిశ్చయించుకొని పుట్టింటివారు క్షేమంగా వుండాలని కోరుకుంటుంది.
మళేరో: మళేరో అంటే తల్లిదండ్రు లను, అన్నాదమ్ములను, స్నేహితులను ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకొంటూ దుఃఖించటం. లంబాడీలలో తల్లులే కాకుండా పెళ్ళి కూతురు తోటి వారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాన్ని పాటలో బోధిస్తారు.
విందు (గోట్‌) : గోట్‌ అంటే విందు అని అర్థం. పెళ్ళి కుమారుడే ఇవ్వాలని ఆచారముంది. తండా జనాన్ని దృష్టిలో పెట్టుకొని మేకల్ని బలి యిస్తారు. రక్తాన్ని పాత్రలో పట్టి ‘సొలోయ్‌’ వండుతారు. సొలోయ్‌ అంటే చింతపండు పులుసు, ఉప్పు, రక్తం కలిపి తయారుచేస్తారు. సరిపోయే కల్లు, సారాయితో సాయంత్రం అందర్నీ బంతిగా కూర్చోబెట్టి సొలోయ్‌ని వడ్డించి మత్తుపానీయాలు సేవిస్తారు, తరువాత భోజనము చేస్తారు.
కుటుంబీకుల సేవ : కన్యకు పెళ్ళి పూర్తికావడంతో ఓ ఇంటి కోడలవుతుంది. అత్తమామలకు ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించాలి. అన్న పానాదులు క్రమ పద్ధతిలో అందునట్లు జాగ్రత్తపడాలి. రాత్రి సమయంలో అత్తమామలకు కాళ్ళు నొక్కడం వీరి ఆచారము. చనిపోయినఅన్న భార్యను, తమ్ముడు భార్యగా స్వీకరించాలి.
==మూలాలు==
*http://bhumika.org/archives/475
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెగలు]]
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు