గులేబకావళి కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
మహారాణి తమ్ముడు (రాజనాల) రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తుంటాడు. ఇంతలో రాజుకు కళ్ళుపోతాయి. 'గులేబకావళి' పుష్పం తెచ్చి రాజు కన్నులకు తాకిస్తే చూపు వస్తుందని తెలియడంతో దానిని తేవడానికి ముగ్గురు మూర్ఖులైన చిన్న భార్య కొడుకులు బయలుదేరతారు. విజయుడు కూడా ప్రయాణమవుతాడు.
 
త్రోవలో యుక్తమతి (జమున) అనే వగలాడి వేసిన పావుల పందెంలో అన్నలు ముగ్గురు ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సును అర్పించి సోదరులను మిగిలిన వారిని విడుదల చేస్తుంది.
 
విజయుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తుండగా సోదరులు దానిని తస్కరించి విజయుడిని బావిలో పడవేసి రాజ్యానికి చేరతారు. బావిలోంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గులేబకావళి పుష్పాన్ని సాధించడమే కాక గులేబకావళిని పెళ్ళిచేసుకొంటాడు.
 
రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట వుండటం చూసి ఆశ్చర్యపోతారు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించడమే గాక వక్రకేతుతో పోరాడి అంతమొందిస్తాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గులేబకావళి_కథ" నుండి వెలికితీశారు