ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

సియెస్1 లోపాలను సవరించాను
పంక్తి 46:
 
=== గాయకునిగా ప్రయత్నం ===
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు [[సుసర్ల దక్షిణామూర్తి]], [[పెండ్యాల నాగేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో [[ఎస్.పి.కోదండపాణి|ఎస్. పి. కోదండపాణి]] బాలు ప్రతిభను గమనించాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. [[1966]]లో నటుడు, నిర్మాత అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. "''ఏమి ఈ వింత మోహం''" అనే పల్లవి గల ఈ పాటను ఆయన [[పి.సుశీల|పి. సుశీల]], [[కల్యాణం రఘురామయ్య]], [[ప్రతివాది భయంకర శ్రీనివాస్|పి. బి. శ్రీనివాస్]] లతో కలిసి పాడాడు.<ref name="tamilstar">tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20051117102300/http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml |date=2005-11-17 }} గురించి వివరాలు [[జూన్ 04]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి అవకాశాలు ఇప్పించేవాడు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
 
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దూజె కేలియె|ఏక్ దుజే కేలియే]] లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name="eenadu">ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20080605193716/http://www.eenadu.net/breakhtml5.asp |date=2008-06-05 }} పై వ్యాసం. [[జూన్ 04]],[[2008|2008న]] సేకరించబడినది.</ref>
 
బాలుకు తన వృత్తిపట్ల ఎంత అంకితభావముందో తెలియడానికి ఒక ఉదాహరణ ఏమంటే 1989లో వచ్చిన కమల్ హసన్ చిత్రం [[ఇంద్రుడు చంద్రుడు (1989 సినిమా)|ఇంద్రుడు చంద్రుడు]]<nowiki/>లో డ్యూయెల్ రోల్స్ లో ఒకపాత్ర(జి.కె.రాయుడు)మాట్లాడే యాసకి తగ్గట్టుగా "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ" అనే పాటపాడి గొంతులో చిన్నగుల్ల వచ్చి పాడడానికి ఇబ్బంది పడి తర్వాత శస్ర్తచికిత్స చేయించుకొన్నారు.ఈ విషయాన్ని బాలునే స్వయంగా ఎన్నో ఇంటర్వూలలో చెప్పారు.
 
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అయనికి '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.
పంక్తి 70:
{{ప్రధాన వ్యాసం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలు}}
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది.<ref>{{cite news|title=Raja-Lakshmi award for S.P. Balasubrahmanyam|url=http://www.hindu.com/2006/08/15/stories/2006081505050400.htm|accessdate=23 May 2013|newspaper=[[The Hindu]]|date=15 August 2006|author=Special Correspondent|location=Chennai, India|archive-date=1 October 2007|archive-url=https://web.archive.org/web/20071001030118/http://www.hindu.com/2006/08/15/stories/2006081505050400.htm|url-status=dead}}</ref><ref>{{cite news|last=AR|first=Reshmi|title=SPB broke South Indian accent myth|url=http://articles.timesofindia.indiatimes.com/2012-06-04/news-interviews/32030499_1_singer-songs-accent|accessdate=23 May 2013|newspaper=[[The Times of India]]|date=4 June 2012|archive-date=29 June 2013|archive-url=https://archive.today/20130629121745/http://articles.timesofindia.indiatimes.com/2012-06-04/news-interviews/32030499_1_singer-songs-accent|url-status=dead}}</ref> ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన [[శంకరాభరణం]] చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ''ఏక్ దూజే కేలియే'' చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత [[సాగర సంగమం]] (1983), [[రుద్రవీణ (సినిమా)|రుద్రవీణ]] (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు<ref>{{cite web|url=http://www.sify.com/movies/spb-to-be-honoured-news-telugu-kkfsm1ehhja.html |title=SPB to be honoured |publisher=Sify.com |date=24 March 2009 |accessdate=1 May 2011}}</ref><ref name="Most no of songs">{{cite news |url=http://www.hindu.com/fr/2006/02/03/stories/2006020301430200.htm |title=Entertainment Hyderabad / Events : In honour of a legend |newspaper=The Hindu |date=3 February 2006 |accessdate=2 May 2011 |archive-date=1 January 2014 |archive-url=https://web.archive.org/web/20140101225852/http://www.hindu.com/fr/2006/02/03/stories/2006020301430200.htm |url-status=dead }}</ref>
* పద్మశ్రీ (2001)<ref name="spbindia">స్వంత వెబ్సైటు నుండి [http://www.spbindia.com/AwardsAchievements.aspx ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాల] {{Webarchive|url=https://web.archive.org/web/20100415181336/http://www.spbindia.com/AwardsAchievements.aspx |date=2010-04-15 }} గురించి వివరాలు [[జూన్ 04]],[[2008|2008న]] సేకరించబడినది.</ref>
* డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా
* పద్మభూషణ్ (2011)
పంక్తి 77:
 
==మరణం==
2020 ఆగస్టు 5 న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు [[కోవిడ్-19 వ్యాధి]] సోకినట్టు ప్రకటించాడు.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/magazines/panache/sp-balasubramaniam-who-tested-positive-remains-critical-singer-put-on-life-support/articleshow/77546328.cms|title=Covid-19: SP Balasubramaniam remains critical after testing positive, put on life support|last=|first=|date=14 August 2020|work=The Economic Times|access-date=14 August 2020|url-status=live}}</ref><ref>{{Cite web|last=Suri|first=Manveena|last2=Woodyatt|first2=Amy|title=Famed Indian film singer SP Balasubrahmanyam on life support|url=https://www.cnn.com/2020/08/14/entertainment/sp-balasubrahmanyam-life-support-covid-19/index.html|title=Famed Indian film singer SP Balasubrahmanyam on life support|last=CNN|first=Manveena Suri and Amy Woodyatt|website=CNN|access-date=2020-08-15|website=CNN}}</ref> చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/movies/sp-balasubrahmanyam-tested-corona-positive-1306463|title=ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌|date=2020-08-05|website=Sakshi|language=te|access-date=2020-09-25}}</ref> ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబరు 25 న మధ్యాహ్నం 1.04 లకు బాలు తుదిశ్వాస విడిచాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/legendary-singer-sp-balasubramaniam-passed-away-/0210/120112594|title=సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత|date=2020-09-25|website=web.archive.org|access-date=2020-09-25|archive-date=2020-09-25|archive-url=https://web.archive.org/web/20200925083117/https://www.eenadu.net/cinema/newsarticle/legendary-singer-sp-balasubramaniam-passed-away-/0210/120112594|url-status=bot: unknown}}</ref> 2020 సెప్టెంబరు 26న తిరువళ్ళూరు జిల్లాలోని రెడ్ హిల్స్, తామరపాకం లోని ఆయన వ్యవసాయం క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/sp-balasubrahmanyam-passes-away-the-whole-country-mourns-the-death-of-spb/|title=SP Balasubrahmanyam passes away, the whole country mourns the death of SPB|last=Boy|first=Zupp|date=2020-09-25|website=Moviezupp|language=en-US|access-date=2020-10-12}}</ref><ref name="గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు">{{cite news |last1=Namasthe Telangana |title=గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు |url=https://www.ntnews.com/cinema/tollywood-celebrities-and-actores-who-died-in-last-10-in-years-in-telugu-industry-25881 |accessdate=30 November 2021 |date=27 March 2021 |archiveurl=https://web.archive.org/web/20210327153101/https://www.ntnews.com/cinema/tollywood-celebrities-and-actores-who-died-in-last-10-in-years-in-telugu-industry-25881/ |archivedate=30 November 2021}}</ref>
 
==మూలాలు==