త్రియుగీ నారాయణ్ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
సియెస్1 లోపాలను సవరించాను
పంక్తి 38:
రా౦పూరు ను౦డి 5 కిలోమీటర్ల దూర౦లో త్రియుగి నారాయణ్ క్షేత్రం ఉంది. ఇది చాల చిన్న గ్రామం. ఇది చాల పురాతనమయిన పవిత్ర స్థలము. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలం . ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. అక్కడ హోమగుండం ఉ౦ది. అది మూడు యుగాల నుండి అలావెలుగుతూనే ఉన్నదని చెబుతారు. దీని పక్కన ఒక మనిషి కూర్చుని ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు ఆ హోమకుండంలో తలొక కట్టే వేస్తారు. ఆ హోమకుండము లోని విభూతి అతి పవిత్రమైనదిగా భావిస్తారు. మూడు యుగముల నుండి ఈ మంట మండుతూనే ఉన్నది కనుక దీనికి ఈ ఆలయంలో ఉన్న నారాయణుడే సాక్షి కనుక, ఈ స్వామికి త్రియుగి నారాయణ్ అనే పీరు వచ్చింది యని స్థలపురాణము. ఆలయం బయట ఒక చిన్నమందిరం ఉంది .నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుండి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంది.సత్య యుగములో శివపార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగింది అని స్దలపురాణం. ఆలయం బయట ప్రాంగణములో 3కుండములు వరసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వీటిని బ్రహ్మకుండము, విష్ణుకుడమ సరస్వతీ కుండం అని అంటారు.
== శబ్ద వ్యుత్పత్తి ==
త్రియుగీ నారాయణ్ అన్నది త్రియుగి, నారాయణ్ అన్న రెండు పదాల కలయికగా రూపొందింది. వీటిలో నారాయణ్ అన్నది కొలువైవున్న దేవుని గురించిన పదం కాగా, త్రియుగి పదానికి పలు అర్థాలు చెప్తున్నారు. హిందూ నమ్మకాల ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తూండగా ఈ ఆలయానికి సత్య, ద్వాపర, త్రేతా యుగాల వైభవం కలిగివుందనీ, అత్యంత సుదీర్ఘమైన దేవమానంలో దేవతల మూడు తరాలను చూసినదనీ పలు విధాలైన అర్థాలను త్రియుగీ అన్న శబ్దానికి చెప్తారు. అలానే వసంత, శరత్తు, వర్ష రుతువులు ఒకే సమయంలోనూ, త్రేతాగ్నులుగా భావించే మూడు అగ్నులు ఎల్లప్పుడూ నివసించేదనీ అర్థం చెప్తూంటారు. ఈ అర్థం కాక త్రియుగి అన్న శబ్దానికి గుప్తం అంటే రహస్యం, అదృశ్యం అన్న అర్థం ఉండగా, నారాయణుడన్న శబ్దానికి వ్యాపకార్థం ఉంది. దీని ప్రకారం అదృశ్యంగా, అంతటా వ్యాప్తి పొందినవాడన్న అర్థం త్రియుగీ నారాయణునికి అన్వయిస్తూంటారు.<ref name="సుపథలో త్రియుగీ నారాయణ్ గురించి">{{cite journal |last1=పుల్లూరి |first1=దయాకర్ |date=జనవరి 2016 |editor1-last=వల్లూరి |editor1-first=విజయ హనుమంతరావు |title=త్రియుగీ నారాయణ్ |format= |journal=సుపథ సాంస్కృతిక ద్వైమాసిక పత్రిక |datelanguage=జనవరితెలుగు - ఫిబ్రవరి, 2016|volumelocation=16|issue=2|pages=17-19తాడేపల్లిగూడెం |publisher=శివానంద సుపథ ఫౌండేషన్ |locationvolume=తాడేపల్లిగూడెం16 |languageissue=తెలుగు2 |formatpages=ప్రింట్17-19}}</ref>
== పౌరాణిక ప్రశస్తి ==
[[File:Ellora-caves-1.jpg|thumb|శివపార్వతుల వివాహాన్ని ప్రతిబింబిస్తున్న ఎల్లోరా కుడ్యశిల్పం]]