ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
పంక్తి 42:
రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.
 
17 యేళ్ళ వయసులో 1924లో [[మేనమామ]] కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నాడు. వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టింది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశాడు. 1930 లో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి బొంబాయి వెళ్ళాడు.<ref>{{Cite book|title=చలన చిత్ర వర ప్రసాదం - యల్.వి. ప్రసాద్|last=ఆచారం|first=షణ్ముఖచారి}}</ref>.
 
==సినిమా రంగము==
పంక్తి 50:
ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ గారు [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.యం. రెడ్డి]] ని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ "టాకీ" కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత తొలి తెలుగు "టాకీ" భక్త ప్రహ్లాదుడులో అవకాశమిచ్చాడు. అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్ కు ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న"కమర్-ఆల్-జమాన్" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని దొరికింది. తన పేరు ఉపయోగించడానికి చాలా పొడవుగా ఉందన్న కారణముగా అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు పేరు ఎల్వి ప్రసాద్ గా కుదించబడింది.
 
ఈ రెండు సినిమాలు విజయవంతం అయిన తరువాత ఏలూరు వెళ్ళి భార్యను తీసుకొని తిరిగి బొంబాయి వచ్చాడు, సినిమా అవకాశాలు లేక జీవనోపాధికి డ్రీము ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరారు. అప్పుడే [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.యం. రెడ్డి]] తెలుగులో నిర్మింస్తున్న సతీ సావిత్రి సినిమాలో నటిస్తూ రాత్రి గేట్ కీపర్ పనిచేసారు.<ref name=":0">{{Cite book|title=వెండితెర ప్రసాదం - ఎల్.వి. ప్రసాద్|last=శ్రీనివాస భాను|first=ఒలేటి|publisher=Creative Links Publications|year=2015}}</ref>.
 
తంత్ర సుబ్రహ్మణ్యం తన "కష్ట జీవి" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ప్రసాద్ కి మరి కొన్ని ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో పృథ్వీరాజ్ కపూర్ తో పరిచయం తో పృథ్వీ థియేటర్స్ అనే నాటక సమాజం లో చేరి శకుంతల, దీవార్ అనే నాటకాలలో నటించాడు. ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి హిందీ సినిమా "శారద" లో హీరో గా నటిస్తున్న [[రాజ్ కపూర్]]ని కలుసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు