"పాసీ" కూర్పుల మధ్య తేడాలు

455 bytes added ,  12 సంవత్సరాల క్రితం
మరింత అర్ధవంతమైన పరిచయం
(మరింత అర్ధవంతమైన పరిచయం)
'''పాసీ''' భారతదేశంలోని ఒక దళిత కులం.<ref>http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/</ref> భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.
'''పాసీ''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] డి గ్రూపులోని [[కులం]].
 
==చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్లో నివసిస్తున్న `పాసి' కులస్థులు ఒకప్పుడు ఉత్తరాది నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశంలో వీరి జనాభా ఎక్కువ. అక్కడ వీరి కులవృత్తి [[పందులు|పందుల]] పెంపకం. ఎంతో కాలం కిందటే ఆంధ్ర ప్రదేశ్ వచ్చిన పాసీ కులంవారు బొగ్గు గనులున్న ప్రాంతంలో స్థిరపడ్డారు. బొగ్గు గనుల్లో పనిచేయించేందుకు ఉత్తర భారతదేశం నుంచి ఆంగ్లేయులు పాసి కులస్థులను ఆంధ్రప్రదేశ్‌లోని కోల్‌ బెల్ట్ కు తీసుకొచ్చారు. అప్పట్లో పాసీలు ఎడ్లబండ్లపై 45 రోజులు ప్రయాణంచేసి ఇల్లందు ప్రాంతానికి చేరుకున్నారు. 1889లో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. కనుకనే ఇప్పటికీ కోల్‌ బెల్టు ప్రాంతంలో పాసీలు ఎక్కువగా కనిపిస్తారు. ఉత్తరాది నుంచి వచ్చారు కనుక [[పరదేశీ]] అని అప్పట్లో పిలిచేవారు. పాసీ అంటే ఇప్పటికీ పరదేశీ అనే అంటారు. వీరు మాతృభాష [[అవధి]] ని మర్చిపోలేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/383009" నుండి వెలికితీశారు