పాసీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==చరిత్ర==
పాసీ అన్న పదం సంస్కృతంలోని పశిక అన్న పదము నుండి వచ్చిందని భావిస్తారు. తాటి చెట్లు ఎక్కడానికి పెద్ద పాశాన్ని (తాడు) ఉపయోగిస్తారు కాబట్టి పశిక అన్న పేరు వచ్చింది. సాంప్రదాయకంగా కల్లు సేకరణ వీరి వృత్తి<ref>Maharashtra By K. S. Singh, B. V. Bhanu, B. R. Bhatnagar, Anthropological Survey of India, D. K. Bose, V. S. Kulkarni, J. Sreenath పేజీ.1683 [http://books.google.com/books?id=4bfmnmsBfQ4C&pg=PA1683]</ref>
ఆంధ్ర ప్రదేశ్లో నివసిస్తున్న `పాసి' కులస్థులు ఒకప్పుడు ఉత్తరాది నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశంలో వీరి జనాభా ఎక్కువ. అక్కడ వీరి కులవృత్తి [[పందులు|పందుల]] పెంపకం. ఎంతో కాలం కిందటే ఆంధ్ర ప్రదేశ్ వచ్చిన పాసీ కులంవారు బొగ్గు గనులున్న ప్రాంతంలో స్థిరపడ్డారు. బొగ్గు గనుల్లో పనిచేయించేందుకు ఉత్తర భారతదేశం నుంచి ఆంగ్లేయులు పాసి కులస్థులను ఆంధ్రప్రదేశ్‌లోని కోల్‌ బెల్ట్ కు తీసుకొచ్చారు. అప్పట్లో పాసీలు ఎడ్లబండ్లపై 45 రోజులు ప్రయాణంచేసి ఇల్లందు ప్రాంతానికి చేరుకున్నారు. 1889లో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. కనుకనే ఇప్పటికీ కోల్‌ బెల్టు ప్రాంతంలో పాసీలు ఎక్కువగా కనిపిస్తారు. ఉత్తరాది నుంచి వచ్చారు కనుక [[పరదేశీ]] అని అప్పట్లో పిలిచేవారు. పాసీ అంటే ఇప్పటికీ పరదేశీ అనే అంటారు. వీరు మాతృభాష [[అవధి]] ని మర్చిపోలేదు.
 
"https://te.wikipedia.org/wiki/పాసీ" నుండి వెలికితీశారు