"అణుపుంజము" కూర్పుల మధ్య తేడాలు

*'''శాఖీయ పాలిమర్లు''': మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్
*'''క్రాస్ లింక్ డ్ పాలిమర్లు''': మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్
 
పాలిమర్లను తయారయ్యే పద్ధతిని బట్టి కూడా వర్గీకరిస్తారు.
*'''సంకలన పాలిమర్లు''': చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్
*నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు.
 
పాలిమర్ అణువుల మధ్య వుండే వాండర్ వాల్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు వాటి ధృఢత్వానికి, స్థితిస్థాపకతకు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు.
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/383408" నుండి వెలికితీశారు