మల్లమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎కథా సంగ్రహం: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
 
పంక్తి 72:
మల్లమ్మ మీద కన్ను వేసిన రంగడు ఒక రాత్రి పాకలో దూరి ఆమెను బలాత్కరించబోయాడు. మల్లమ్మ ఎదురు తిరిగి అక్కడ ఉన్న కత్తిపీట తీసుకుని అతడిని బెదిరించింది. దాంతో రంగడు పారిపోయాడు. ఇది చూసిన దుర్గ, చండి ఇంట్లో మగవాళ్ళకీ దృశ్యం చూపించారు. మగవాళ్ళు మారు పలకలేక పోయారు. దీనికి తోడు ఇంట్లో పోయిన దేవుడి వెండి విగ్రహాలు మల్లమ్మనే దొంగిలించిందని నిందమోపి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అవమానాలతో కృంగిపోయిన మల్లమ్మను ఒక కోయరాజు ఆదరిస్తాడు. తన ప్రియురాలు సరస కోసం ఇంట్లో నగలు దొంగలించిన వేమారెడ్డి పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చి ఆ విషయం చెబుతాడు. వెంగళరెడ్డి మల్లమ్మను వెదుకుకుంటూ వెడతాడు. రంగడు మళ్ళీ మల్లమ్మను బలాత్కరించబోయాడు. వెంగళరెడ్డి రంగడిమీద పడ్డాడు. ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు. వెంగళరెడ్డి రంగడి చేతిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇది చూసిన మల్లమ్మ తన భర్తను కాపాడమని శివుని గొంతెత్తి ప్రార్థించింది. ఆమె భక్తికీ, ప్రార్థనకూ ప్రకృతి చలించిపోయింది. శివుని ఆత్మజ్యోతి బయలు దేరి మల్లమ్మలో చేరింది. శివుడు స్థాణువు అయిపోయాడు. నారదుడు పార్వతితో తనకు పతిభిక్ష పెట్టమని మల్లమ్మను వేడుకోమంటాడు. పార్వతికి పతిభిక్ష లభించింది. జ్యోతి శివునిలో చేరింది. మల్లమ్మ మహాభక్తురాలని, శక్తి కన్నా భక్తి గొప్పదని పార్వతి అంగీకరించింది.
 
మల్లమ్మ భక్తికి సంతసించి శివుడు ఆమెక్కూడా శ్రీశైలంలో తన సన్నిధిలోనే స్థానం లభిస్తుందని ఆశీర్వదించాడు. ఆ విధంగా వెలసిన మల్లమ్మ విగ్రహం నేటికీ శ్రీశైలం దేవాలయంలో ఉంది.<ref>{{cite book |last1=ఈశ్వర్ |title=మల్లమ్మ కథ పాటల పుస్తకం |pages=12 |url=https://indiancine.ma/document/CDC/11 |accessdate=14 August 2020}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మల్లమ్మ_కథ" నుండి వెలికితీశారు