రైతుబిడ్డ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+వంగర వెంకటసుబ్బయ్య లింకు
చి →‎చిత్రకథ: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 49:
ఎన్నికలలో తాను ఘోర పరాజయం పొందినందుకు జమీందారు కుమిలిపోయాడు. ఆ దుర్భరావమానంతో ఎవర్నీ దగ్గరకు రానివ్వకుండా ఒంటరిగా ఉండసాగాడు. జమీందారు నమ్మినబంటు సుబ్బన్న ఎలాగైనా జమీందారు కోపాన్ని శాంతింప జెయ్యాలని, తన చెల్లెలు రాజరత్నాన్ని జమీందారుకు దాఖలు చేసి, తాను పగ సాధిస్తానని నాగపురం వెళ్ళాడు. నాగాపురంలో సుబ్బన్న షావుకారు ఇంట్లో మకాంపెట్టి రైతులనూ, స్త్రీలనూ బాధించడం మొదలుపెట్టాడు. నర్సిరెడ్డి కుమారుడు మరణావస్థలో వున్న సమయంలో షావుకారు నర్సిరెడ్డి కుమారుడిని పడగొట్టాడు. దాంతో అతను మరణించాడు. నర్సిరెడ్డి కుటుంబం విచారసాగరంలో మునిగిపోయింది. ప్రకృతి ఫర్జించింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. వరదలలో ఆ ప్రాంతం అంతా తేలిపోయింది. వరదలు గొప్పవారినీ, బీదవారినీ ఏకం చేశాయి. కరణం ఆ వరదలలో కొట్టుకుపోతూ ఉంటే, మునసబు రక్షించాడు. షావుకారును బందిపోటు దొంగలు దోచుకున్నారు.
 
శావల్యాపురంలో జమీందారు తమ్ముడు, తన అన్న తర్వాత జమీందారీకి తానే వారసుడు కావాలనే దురుద్దేశంతో జమీందారు పుత్రుని సంగ్రహించి, ఆ నేరం నర్సిరెడ్డి మీదికి నెట్టాడు. తినడానికి తిండి, ఉండడానికి కొంపాలేక నాగాపురంలో అందరూ అవస్థలు పడసాగారు. షావుకారు, కరణం తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి రైతులతో కలిశారు. అందరూ కలిసి తమ కనీసపు కోర్కెలను తీర్చవలసిందిగా జమీందారుకు విజ్ఞాప్తులు పంపుకున్నారు. జమీందారు నర్సిరెడ్డిని పిలిపించడం, తన తమ్ముడు చేసిన కుట్ర బయటపడడం, కుమారుడు దొరకడం, జమీందారుకు పరివర్తన కలగడం జరిగి కథ సుఖాంతమవుతుంది.<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=నాటి చిత్రాల కథలు రైతుబిడ్డ|journal=విజయచిత్ర|date=1 October 1971|volume=6|issue=4|pages=9-10|accessdate=9 May 2017}}</ref>.
 
==పాటలు==