సిలోన్ మనోహర్: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Ceylon Manohar.jpeg as it is deleted
చి →‎top: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
పంక్తి 6:
}}
 
'''సిలోన్ మనోహర్''' ఒక సినిమా నటుడు, పాప్ గాయకుడు. ఇతడి అసలు పేరు ఎ. ఇ. మనోహరన్. ఇతడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సుమారు 260 సినిమాలలో నటించాడు. ఇతడు 1964లో శ్రీలంకన్ తమిళ సినిమా "పాసా నీల"లో హీరోగా నటించాడు. 1970లో [[కొలంబో]]లో గాయకుడిగా తన వృత్తిని ఆరంభించాడు. అంతకు ముందు ఇతడు నాటకాలలో పనిచేశాడు. 1973 నాటికి ఇతడు పాప్ స్టార్‌గా ఎదిగాడు. జాఫ్నా మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇతనికి "పాప్ చక్రవర్తి" అనే బిరుదు లభించింది. ఇతడు ఇంగ్లీషు, సింహళము, తమిళ భాషలలో పాటల ఆల్బంలు విడుదలచేశాడు<ref>[http://www.veethi.com/india-people/ceylon_manohar-profile-7539-14.htm సిలోన్ మనోహర్ ప్రొఫైల్]</ref>. ఇతడు ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా, కెనడా, సింగపూర్ మొదలైన ప్రదేశాలలో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలోని బ్రీజ్ హోటల్‌లో 1999-2000 ప్రాంతంలో గాయకుడిగా కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.<ref>{{Cite web |url=http://tamilweek.com/news-features/archives/261 |title=Sri Lankan Pop Music Maestro A.E. Manoharan |website= |access-date=2018-01-04 |archive-url=https://web.archive.org/web/20160223044649/http://tamilweek.com/news-features/archives/261 |archive-date=2016-02-23 |url-status=dead }}</ref>.
==నటుడిగా==
ఇతడు అనేక భారతీయ భాషా చలనచిత్రాలలో [[శివాజీ గణేశన్]], [[రజనీకాంత్]], [[కమల్ హాసన్]], [[మమ్ముట్టి]], [[ధర్మేంద్ర]], [[చిరంజీవి]] మొదలైన నటుల సరసన నటించాడు.
"https://te.wikipedia.org/wiki/సిలోన్_మనోహర్" నుండి వెలికితీశారు