క్షీరారామం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
}}
 
'''క్షీరారామం''' పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో [[పంచారామాలు]]గా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. <ref>{{Cite web|date=2023-02-18|title=Panchamukha : పంచముఖుని పంచారామాలు {{!}} Pancharamas of Panchamukha mvs|url=https://web.archive.org/web/20230218112112/https://www.andhrajyothy.com/2023/navya/pancharamas-of-panchamukha-mvs-1012348.html|access-date=2023-02-18|website=web.archive.org}}</ref> ఇది [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[పాలకొల్లు]] లో వుంది. దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు. ఈ మందిరాన్ని [[చాళుక్యులు|చాళుక్యుల]] కాలంలో, 10 - 11 శతాబ్దులలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న సా.శ. 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]లో ఎత్తయిన,, [[చోళ సామ్రాజ్యము|చోళ]] రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
 
 
== ఆలయ ప్రశస్తి ==
ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే [[శివ లింగము|శివలింగం]] ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు. [[శివ లింగము|శివలింగం]] పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో [[పార్వతి]]దేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర [[వినాయకుడు|గణపతి]] ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/క్షీరారామం" నుండి వెలికితీశారు