స్వకులసాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] బి గ్రూపులోని 19వ కులం. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో [[స్వకులశాలి ]] కులస్తులు నివసిస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా వీరి జనాభా 80 వేలు కాగా, అందులో 40 వేలమంది ఒక్క ఆదోని పట్టణం లోనే ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా వీరిలో కొందరు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. తమ పూర్వీకులు మహారాష్ర్ట నుంచి వలస వచ్చారనీ, స్వకులశాలి కులస్తులు అంటారు. స్వకుల శాలి కులస్తులు సైని కులకు వస్త్రాలు నేయటానికి మరాఠీ సైన్యంతోపాటు శ్రీశై లం చేరుకున్నారు. ఇలా వచ్చిన వారిలో వృద్ధులు పైన్యం తో వెళ్లలేక వారి కుటుంబాలతో అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆదోని, గద్వాల్‌, నారాయణ్‌పేట్‌, ధర్మవరంలలో స్థిరపడగా, కొందరు కర్నాటక ప్రాంతం లోని హుబ్లి, బెల్గాం, రాయచూర్‌లను ఎంచుకున్నారు.
 
చేనేత రంగంలోకి యాంత్రీకరణ ప్రవేశం, తర్వాత పవర్‌లూమ్‌‌ చోటు చేసుకోవటంతో ఆ స్పీడుకు వీరు పోటీపడలేకపోయారు. వీరి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో పాతపద్దతులనే అనుసరించారు. ఉద యం మగ్గం గుంటలో దిగితే అక్కడి నుంచి లేచేసరికి చీకటిపడేది. ఈ విధంగా కుటుంబ సభ్యులు మొత్తం ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కుటుంబానికి కావలసిన కనీస అవసరాలు కూడా తీరేవి కావు. గాలి వెలుతురు లేక నిత్యం నేతపనిలో నిమగ్నం కావటంతో శ్వాసకోశ వ్యాధులకు గురయ్యేవారు. అప్పులు చేసి మెటీరియల్‌ తీసుకొచ్చినా పవర్‌లూమ్‌‌తో పోటీపడలేకపోయే వారు. రేటు సైతం గిట్టుబాటు అయ్యేదికాదు. కనుక చేసిన అప్పులకు వడ్డీలు పెరగటంతో వీరి జీవితం మరిం త దుర్బరమైంది. కొందరు ఇతర వృత్తులను చేపట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నేటికీ కుల వృత్తిని నమ్ముకున్నవారు వీరిలోనే ఎక్కవమంది ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతా లలో ఉంటున్న వారికిఅధికారులువారికి అధికారులు కుల ధృవీ కరణ పత్రా లు మంజూరు చేయకపోవటంతో ఇబ్బందులకు గురవు తున్నారు. తమని బిసి-బి గ్రూప్‌ నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చాలని కోరుతున్నారు.
 
==మూలాలు==
*http://www.suryaa.com/showspecialstories.asp?ContentId=9492
"https://te.wikipedia.org/wiki/స్వకులసాలి" నుండి వెలికితీశారు