జనమేజయుడు: కూర్పుల మధ్య తేడాలు

కామన్స్ నుంచి బొమ్మ చేర్పు
విస్తరణ
పంక్తి 3:
'''జనమేజయుడు''' మహాభారతంలో [[పరీక్షిత్తు]] కుమారుడు. [[అర్జునుడు|అర్జునునికి]] ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన [[వైశంపాయనుడు]] ఇతనికి మహాభారత కథను వినిపించెను.
 
తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి [[తక్షకుడు]] కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి [[సర్పయాగము]] చేసెనుచేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహభారతం వినిపించాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/జనమేజయుడు" నుండి వెలికితీశారు