నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
ప్రముఖ సినీనటి '''నిర్మలమ్మ''' తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఆమె వయసు 89 సంవత్సరాలు.
 
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1950లో తన పదహారేళ్ల వయసులో '[[గరుడ గర్వభంగం]]' సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. నాటి [[ఎన్టీరామారావు‌]], [[అక్కినేని]]ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]] వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. పలు నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు.
 
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. ''[[స్నేహం కోసం]]'' చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఆమె చివరి చిత్రం ''[[ప్రేమకు ఆహ్వానం]]''.
 
నిర్మలమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి [[హైదరాబాదు]]‌లో [[19 ఫిబ్రవరి]], [[2009]] రోజున మృతిచెందారు
 
 
==నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు