"శివాలయం" కూర్పుల మధ్య తేడాలు

==నిర్మాణ సంప్రదాయాలు==
 
సాధారణంగా హిందూ [[దేవాలయం|దేవాలయాల]] నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల [[గోపురం]] లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన [[శిల్పాలు]] చెక్కబడి ఉంటాయి.
 
 
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, [[గర్భగుడి]]లో [[శివలింగం]] ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/387716" నుండి వెలికితీశారు