భమిడిపాటి కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎భమిడిపాటి హాస్య గుళికలు: అద్దెకున్నా వాళ్ళ బాధలు
పంక్తి 175:
**..."ఈ వ్యాపారంలో ఎల్లానైనా నేనే ఓ గొప్పవాణ్ణికావాలి, కానీ ఖర్చుకాకుండా. అధమం వీణ్ణి కానియ్యకూడదు...."
**"...పంపకాలు కుదరక పారపోసుగోడం మనకి కొత్తగాదు!..."
*'''అద్దెకొంపలు''' వ్యాసం నుండి
**"....అద్దె యజమానురాలుగారు ఒక్కత్తే ఒక యెత్తూ! ఒక్కొక్క యజమానురాలి చర్య అద్భుతం! అసలు ఆవిడ గృహిణి, అందులో అద్దెకొంపల రాణీ. అందులో కాస్త స్వాతిశయంకూడా ఉంటే ఆవిడ అద్దెకొచ్చిన వాళ్ళని ఎలాచూస్తుందని తమ ఊహ? తప్పు చేసిన కోడల్ని అత్తగారు ఇంతగా రొకాయించదు! నీతితప్పిన పెళ్ళాన్ని తాళి గట్టినముగుడు ఇంతగా దండించడు! నేరంచేసిన పాపిని దండనాధికారి ఇంతగా దుయ్యబట్టడు! చవట పరిపాలన చేసే మండలేశ్వరుణ్ణి సామాజ్య మంత్రి ఇంతగా ఆజ్ఞ పెట్టడు! అద్దెల వాళ్ళ ఆచారం గర్వం, తన ఆచారం మడి. తన వస్తువు ఇంకోరి ఇంట్లో కనపడితే, వారిది దొంగతనం; ఇంకోరి వస్తువు తనింటోఉంటే "ఎక్కడికి పోతుందే! పొరపాటో" అవడం! అద్దెలవాటాల తూముల్లోంచి ప్రవహించేది అపవిత్రమైన కంపుముండానీరు, తన వాటా తూముల్లోంచి వెళ్ళేది పావనమైన అభిషేకజలం(ఇదంతా కలిపి ఒకటే తోము అయినా సరే ఆవిడ వాదన అంతే). దొడ్లో తక్కినవాళ్ళ వాటాల్లో కాసేవన్నీ కేవలం తనవే. నలుగురూ వచ్చే నూతిదగ్గర తమరి తాలూకు పిల్ల గుడ్డలు మాత్రమే జాడించవచ్చు! అద్దెలవాళ్ళుగనక ఆపనే అక్కడచేస్తే, "ఎవళ్ళకొచ్చింది ఈ వినాశకాలం! అన్నం తింటారా, గడ్డి తింటారా!" అంటో తను ఆపని చేస్తూనే, ధరీ అంచూ లేకుండా లెక్చరు పూర్వకంగా తిట్టడం........"(ఇలా ఇంకా రెండు పుటలు ఉన్నది, అప్పటి అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎదుర్కోవలసిన బాధల చిట్టా)
 
==మూలాలు==