తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==ముఖ్య కవులు, రచనలు==
ఈ యుగానికి చెందిన [[నన్నెచోడుడు]], [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[పాల్కురికి సోమనాధుడు]] అనే కవులను శైవ కవిత్రయంగా పేర్కొంటారు. [[శ్రీపతి]] పండితుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య కూడా శివకవులే. శివకవులలో శైవాభిమానం, దేశికవితాభిమానం, శైలీస్వేచ్ఛ ముఖ్య లక్షణాలు. క్రీ.శ. 1160 కాలానికి చెందిన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. నన్నయ కంటే నన్నెచోడుడు ముందువాడని [[మానవల్లి రామకృష్ణకవి]] వాదించాడు కాని ఆ వాదం నిలబడలేదు.<ref name="dvana">'''తెలుగు సాహిత్య చరిత్ర''' - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)</ref>. పాల్కురికి సోమనాధుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. ఇతడు తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో అనుభవ సారము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం అనేవి మాత్రం లభించాయి. [[శతక వాఙ్మయం]]లో లమకు లభిస్తున్న మొట్ట మొదటి శతకంగా వృషాధిప శతకాన్ని పేర్కొంటారు. మల్లికార్జున పండితారాధ్యుడు చాలా గ్రంధాలు వ్రాసి ఉండాలికాని శివతత్వ సారము మాత్రం లభిస్తున్నది. మిగిలిన కొన్న గ్రంధాల కర్తృత్వం స్పష్టంగా తెలియరావడంలేదు.