గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాత రాశాడు.
[[మీనా కుమారి]] మరణించిన తరువాత ఆమె రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చువేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత [[అమృతా ప్రీతమ్]] రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన కథా సంకలనం దువాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లేకిన్, అంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
==గుర్తింపులు, అవార్డులు==
*[[2002]]లో సాహిత్య అకాడమీ అవార్డు.
*[[2004]]లో పద్మభూషణ అవార్డు.
*[[2009]]లో ఆస్కార్ అవార్డు (బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో)
 
==వ్యక్తిగత జీవితం==
హుల్జార్ నటి [[రాఖి]]ని పెళ్ళి చేసుకుని విడిపోయాడు. కూతురు మేఘన కూడా సినిమా డైరెక్టర్. దేశ విభజన కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చి ముందు ఢిల్లీలో గడిపినా తరువాత [[ముంబయి]]లో స్థిరపడ్డాడు. అక్కడ ఒక గ్యారేజీలో పని చేస్తుండగానే ప్రగతిశీల రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు