రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
రామాయణ కల్పవృక్షం విశిష్టత గురించి అనేక వ్యాసాలు, రచనలు, ఉపన్యాసాలు వెలువడ్డాయి. వాటిలో "జ్ఞానపీఠ విశ్వనాధ రామాయణ కల్పవృక్షము కావ్య వైభవము" అనేది కోటి సూర్యనారాయణమూర్తి సంకలనం చేసిన వివిధ వ్యాసాల సమాహారం. <ref name="vaibhava">రామాయణ కల్పవృక్షము కావ్యవైభవము - కోటి సూర్యనారాయణ మూర్తి [http://www.archive.org/details/JnanapitaViswanathaSrimadRamayanaKalpaVrukshaKavyaVaibhavamu ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
</ref>. మరొకటి "రామాయణ కల్పవృక్షము - తెలుగుదనము" అనే పరిశీలనా గ్రంధము<ref name="telugudanam"> రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం - రచన: డా. పాణ్యం శ్రీనివాస - ప్రచురణ : పాణ్యం పబ్లికేషన్స్, వెల్దుర్తి, కర్నూలు జిల్లా (2000)[http://www.archive.org/details/RamayanaKalpavrukshamTelugudanam ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>. ఇవే కాకుండా అనేక పత్రికా రచనలలోను, ఉపన్యాసాలలోను, బ్లాగులలోను రామాయణ కల్పవృక్ష వైశిష్ట్యాన్ని పరిశీలకులు ప్రశంసించారు.
 
 
 
"తెలుగు సాహిత్యంలో రామకథ" అనే పరిశోధనా రచనలో రచయిత్రి పండా శమంతకమణి ఇలా అన్నది. "ఆధునిక సాహిత్యంలో వెలువడిన రామాయణరచనలలో ముందుగా పేర్కొనవలసినది రామాయణ కల్పవృక్షమును. ఇది వాల్మీకిరామాయణానుసారి అయ్యును నూతన కల్పనములు, పాత్రపోషణము, వర్ణనా వైచిత్ర్యములతో స్వతంత్ర కావ్యత్వమును సమకూర్చుకొన్నది. అహల్యాశాప విమోచన ఘట్టము, అశ్వమేధ సమయంలో దశరధుడు గుహుని, విశ్వామిత్రుని ఆహ్వానించుట, శివ ధనుర్భంగము, మారీచ వధ వంటి ఘట్టములలో కధనం వాల్మీకి కధనంనుండి గణనీయంగా మార్చబడింది. వాలి వధ, సీత అగ్ని ప్రవేశం వంటి ధర్మ సందేహాస్పదమనిపించే విషయాలను నూత్నమైన మెళకువలతో కవి తీర్చిదిద్దెను. దుష్టపాత్రల చిత్రణలో కూడ క్రొత్త దనము, ఆధ్యాత్మికత జోడింపబడినవి. అన్నింటికంటె విశిష్టముగా పేర్కొనవలసిన విషయం సన్నివేశాలలోను, సంభాషణలలోను, చర్యలలోను కవి మేళవించిన తెలుగుదనం. .. వాల్మీకి రామాయణమునకు వ్యాఖ్యానప్రాయమైన కావ్యముగా కల్పవృక్షము రూపొందింపబడినది. పరంపరాగతమైన సాహిత్య ప్రక్రియలను, ఆధునిక కాలంలో వచ్చిన భిన్న దృక్పధాలను క్షుణ్ణముగా అర్ధము చేసికొని సహృదయుడైన విమర్శకునిగా విచారణశీలిగా రూపొందిన ప్రభావంతుడైన కవి వెలయించిన కమనీయ కావ్యము రామాయణ కల్పవృక్షము. <ref name="ramakatha">తెలుగు సాహిత్యంలో రామకథ - కుమారి పండా శమంతకమణి (ఆంధ్ర సాహిత్య పరిషత్, హైదరాబాదు ప్రచురణ - 1972) [http://www.archive.org/details/TeluguSahithyamuloRamakatha ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు