అమాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: మానవిక తిరగవేత విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 35:
రాజు (కృష్ణ) నీతి, నిజాయితీగల విద్యాధికుడైన, ఒక పెయింటర్, తల్లి, తండ్రి ఎవరూ లేని అనాథ. మేరియమ్మ (జి.వరలక్ష్మి) ఇంట్లో అద్దెకు వుంటున్నాడు. ఎక్కడ ఏ పనిలో ఉద్యోగంలో చేరినా అచ్చట మోసాలు తట్టుకోలేక, ఉద్యోగాలు వదిలివేస్తుంటాడు. జాలి హృదయం గల మేరియమ్మ అతణ్ణి మందలిస్తూనే, అతని పోషణ భారం వహిస్తుంది. చిత్రాలు గీసి డబ్బులు సంపాదించమని, వాటికి తనే డబ్బు చెల్లిస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా రాజు, ఆ వూరిలో ధనవంతుడు, రామనాథ్ (గుమ్మడి) తమ్ముని కూతురు రాణి (జమున)ని కలుసుకుంటాడు. ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని, పిలిచి, తన స్నేహితురాలు (పనిమనిషి) ఆశ (విజయలలిత)ను రాణిగా చెప్పి, అతనితో తమాషా చేస్తుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. రాజుకూడా ఆమె పేద పిల్ల అని ప్రేమిస్తాడు. ఒకసారి డబ్బుతో పర్స్ పోగొట్టుకున్న రామనాథంకి దాన్ని తెచ్చి ఇచ్చిన రాజు నిజాయితి మెచ్చి, అతనికి తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. ఆ కంపెనీలో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంతలో రాజు, తన తమ్ముని కుమార్తె రాణిని ప్రేమించాడని తెలిసి రామనాథం ఆమెనుండి అతన్ని దూరం చేయాలని రాణిని మందలిస్తాడు. ఈలోపు ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వలన జ్వరంతో బాధపడుతున్న మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడడంవల్ల దాంతో ఆమె మరణిస్తుంది.
 
హత్యానేరంపై జైలుపాలయిన రాజును రక్షించటానికి రాణి ప్రయత్నించటం, దాన్ని విఫలం చెయ్యాలని రాణి బాబాయి రామనాథం అడ్డుకోవటం, చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవటంతో అతను అరెస్ట్‌కాబడి, రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు. రాణి, రాజుల వివాహంతో చిత్రం సుఖాంతమౌతుంది.<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-6 అమాయకుడు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 12-05-2018]</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అమాయకుడు" నుండి వెలికితీశారు