విభక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
* త్యాగోద్దేశ్యము గా ఉన్నప్పుడు చతుర్ధీ విభక్తి వస్తుంది. త్యాగము అంటే ఇవ్వడం.
ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.
 
==పంచమీ విభక్తి==
వలనన్, కంటెన్, పట్టి--- [[పంచమీ విభక్తి]].
* అపాయ, భయ, జుగుప్సా, పరాజయ, ప్రమాద, గ్రహణ, భవన, త్రాణ, విరామ, అంతర్థ, వారణంబులు అనేవి వేటివలన జరుగుతాయో ఆ పదాలకు పంచమీ విభక్తి వస్తుంది. అందులోనూ 'వలన' అనే ప్రత్యయం వస్తుంది.
ఉదా: మిత్రుని వలన ధనంబు గొనియె.
 
* అన్యార్థంలో చెప్పేటప్పుడు 'కంటె' అనే వర్ణకం వస్తుంది. అనగా అన్య, ఇతరము, పూర్వము, పరము, ఉత్తరము అనే పదాలతో అన్యము ఉంటే 'కంటె' వస్తుంది.
ఉదా: రాముని కంటె నన్యుండు దానుష్కుండు లేడు.
* నిర్ధారణ పంచమిలో కూడ కంటె ప్రత్యయం వస్తుంది.
ఉదా: మానహాని కంటె మరణము మేలు: ఇక్కడ 'మానహాని' నిర్ధారణము
* పట్టి అనేది హేతువులయిన గుణక్రియలకు వస్తుంది. హేతువు అంటే కారణం. గుణం హేతువు కావాలి, క్రియ కూడా హేతువు కావాలి.
ఉదా: జ్ఞానము బట్టి ముక్తుడగు. ముక్తుడవడానికి కారణము జ్ఞానము
 
==షష్ఠీ విభక్తి==
 
 
"https://te.wikipedia.org/wiki/విభక్తి" నుండి వెలికితీశారు