బి.శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
శ్రీరాములు తొలిసారి [[బళ్లారి]] నగరసభ ఎన్నికల్లో పోటీ చేసి 34వ వార్డులో విజయం సాధించాడు. ఆయన 1999లో [[బళ్లారి]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీరాములు 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[బళ్లారి]] సామాన్య నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన బీజేపీ-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా, 2008లో ముఖ్యమంత్రి బిఎస్.యడియూరప్ప మంత్రిమండలిలో ఆరోగ్య మంత్రిగా విధులు నిర్వహించాడు. ఆయన పై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి & బిజెపికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 46,760 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/bengaluru/Bellary-bypoll-Ruling-BJP-loses-deposit-rebel-Sriramulu-wins/articleshow/10978782.cms|title=Bellary bypoll: Ruling BJP loses deposit, rebel Sriramulu wins &#124; Bengaluru News - Times of India|website=The Times of India}}</ref>
 
ఆయన 2011లో బధవారా శ్రామికర రైతారా కాంగ్రెస్ స్థాపించి 2013లో ఎన్నికల్లో పోటీ చేశాడు. శ్రీరాములు 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ నుంచి [[బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం|బళ్లారి నియోజకవర్గం]] ఎంపీగా గెలిచాడు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొళకాల్మూరు, బాదామిల నియోజకవర్గాల నుండి పోటీ చేసి మోళకాల్మూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై యడియూరప్ప మంత్రిమండలిలో ఆరోగ్య & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.ఆయన 2021లో [[బ‌స‌వ‌రాజు బొమ్మై]] మంత్రిమండలిలో రవాణా మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన [[2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు|2023లో]] జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో ఓడిపోయాడు.<ref name="స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట">{{cite news|url=https://www.sakshi.com/telugu-news/karnataka/1619863|title=స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట|last1=Sakshi|date=14 May 2023|work=|accessdate=14 May 2023|archiveurl=https://web.archive.org/web/20230514050209/https://www.sakshi.com/telugu-news/karnataka/1619863|archivedate=14 May 2023|language=te}}</ref><ref name="ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి">{{cite news|url=https://www.eenadu.net/telugu-news/districts/Karnataka/702/123087014|title=ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి|last1=Eenadu|date=15 May 2023|work=|accessdate=15 May 2023|archiveurl=https://web.archive.org/web/20230515033249/https://www.eenadu.net/telugu-news/districts/Karnataka/702/123087014|archivedate=15 May 2023|language=te}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.శ్రీరాములు" నుండి వెలికితీశారు