అభిజ్ఞాన శాకుంతలము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 7:
దాన్ని విన్న దుష్యంతుడు ఆమెను తానే స్వయంగా రక్షించడానికి పూనుకుంటాడు. కణ్వుడు ఆ సమయానికి ఆశ్రమంలో లేనందున శకుంతల రాజును ఆదరిస్తుంది. అలసట తీరేంతవరకూ రాజు అక్కడే బస బస చేస్తూ, తుమ్మెదలను అటువైపు రానీయకుండా, రాక్షస మూకలు అల్లరి చేయకుండా సంరక్షిస్తుంటాడు. ఆ పరిణామంలో శకుంతలా దుష్యంతులిరువురూ ప్రేమలో పడి, ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్ళి చేసుకుంటారు.
 
కొద్ది కాలమైన తరువాత రాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుని తన విలువైన వజ్రపుటుంగరాన్ని ఆమెకు ఇచ్చి బయలుదేరుతాడు. కణ్వుడు లేని సమయంలో ఆమెను తీసుకుని వెళ్ళడం సబబు కాదని రాజు అభిప్రాయం. రాజు వెళ్ళిపోయిన కొన్ని దినముల తర్వాత ఒకరోజు శకుంతల భర్త గురించి ఆలోచనలో మునిగి ఉండగా స్వతహాగా కోపిష్టియైన [[దుర్వాసుడు|దుర్వాస మహాముని]] ఆమె ఆశ్రమానికి వస్తాడు. ఆమె భర్త గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండగా ఆయన పిలుపులు సరిగా ఆలకించలేదని, ఆమె ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నదో వారు, ఆమె గురించి పూర్తిగా మరిచిపోతారని శపిస్తాడు. శకుంతల ఆ శాపం కూడా వినే స్థితిలో ఉండదు. ఆమె స్నేహితుల్లో ఒకరు ఆ శాపాన్ని ఆమెకు తెలియబరుస్తారు. శకుంతల శాపాన్ని వెనక్కు తీసుకోమని దుర్వాసుని ప్రార్థిస్తుంది. దాంతో శాంతించిన దుర్వాసుడు, ఆ శాప ప్రభావం కేవలం ఒకరోజు మాత్రమే ఉండి తరువాత తొలగిపోతుందని ఆమెను ఊరడిస్తాడు.
 
ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వుడు, తన కుమార్తె దుష్యంతుని తన భర్తగా ఎన్నుకున్నందుకు సంతోషిస్తాడు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అభిజ్ఞాన_శాకుంతలము" నుండి వెలికితీశారు