కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - శీర్షిక తరువాత వైట్ స్పేస్ అక్షరాలు)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 3:
 
== చరిత్ర ==
భారతీయ సంప్రదాయంలోని అన్ని [[కళ]]లలాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి <ref>[[#Moorthy2001|Moorthy (2 p1001)]],7</ref>.<ref>{{Cite web |url=http://www.hindu.com/seta/2005/01/13/stories/2005011300111500.htm |title=The Hindu : Sci Tech / Speaking Of Science : The music of we primates: Nada Brahmam |access-date=2009-02-05 |website= |archive-date=2005-03-31 |archive-url=https://web.archive.org/web/20050331184754/http://www.hindu.com/seta/2005/01/13/stories/2005011300111500.htm |url-status=dead }}</ref> ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల, పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, [[యజుర్వేదం]]లో చెప్పబడింది. [[రామాయణము|రామాయణ]], భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
[[యాజ్ఞవల్క్య స్మృతి]]లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
{{cquote|(వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి). }}
పంక్తి 18:
మనకు లభ్యమగు ప్రాచీన సంగీతశాస్త్ర గ్రంథములు స్వల్పములయ్యు వాని వలన ఆకాలపు సంగీతమునుగూర్చి కొంత తెలుసుకొనుటకు వీలు ఉంది. సంగీత వాజ్మయమునకు ఆది గ్రంథముగా పేర్కొనబడు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి భరతముని విరచిత '''నాట్య శాస్త్రము''', తరువాతి సా.శ.1210-1247 ప్రాంతమునాటి శారంగదేవుని '''[[సంగీత రత్నాకరము]]''' స్వతంత్ర గ్రంథములుగ తెలియబడుచున్నవి. ఈకాలము వరకు దత్తిల, కోహాల, నందికేశ్వర, మతంగ, కశ్యప, యక్షటిక, అభినవగుప్త, మాతృగుప్త, శంకుక, రుద్రట, నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, ముమ్మట, కీర్తిధర మొదలగు సంగీతవేత్తలు భరత నాట్యమును పురస్కరించుకొని వ్యాఖ్యానములు, గ్రంథములను రచించిరి. అంతేకాక తమ గ్రంథములను భరతాంకితముగ వెలయుచుండిరి. నాన్య భూపాలుడు తన గ్రంథమును '''భరతభాష్య''' మనెను.నందికేశ్వరుని '''భరతావర్ణవము''', అభినవగుప్తుని '''అభినవభారతి''' మున్నగునవి ఇట్టివే. కోహలుని '''సంగీతమేరు''', మాతంగుని '''బృహద్దేశి''', దత్తిలుని '''దత్తిలము''', భట్టగోపాలుని '''తాళదీపిక''', శారదాతనయుని '''భావప్రకాశము''' భోజదేవుని '''సరస్వతీకంఠాభరణము''', పార్స్వదేవుని '''సంగీతసమయసారము''' మున్నగు కొన్ని గ్రంథములు స్వతంత్రములుగ రాయబడినను అవిభరతగ్రంథమున గల వివిధ విషయములలో నాట్యకళకు సంబంధిచిన కొన్ని విషయములను ముఖ్యముగ అలంకార రసాదులను, విపుల పరిచించారు. పెక్కు గ్రంథములు నాట్యకళ పరమావధిని గూర్చి, అనగా రసమును గూర్చి మగ్నతతో చెప్పినారు.ఎట్లైనను భరతనాట్యశాస్త్రానుగత సంగతులను అనేకములుగ జేసి చెప్పుటవలన అవి '''సంగీతరత్నాకరము''' కాలమువరకు అంతగ స్వతంత్ర గ్రంథములుగ తెలియలేదు. లోల్లట, ఉద్భట, శంకుక, కీర్తిధర, అభినవగుప్త ఆచార్యాదుల గ్రంథములు నాట్య శాస్త్రమునకు వ్యాఖ్యానములు. కావున 13వ శతాబ్దమువరకు గల సంగీత గ్రంథములు భ్రతనాట్యశాస్త్రమునకు సంబంధిచినవే అని చెప్పుకోవచ్చును. కాని వీటిలో సంగీతమునకు సంబంధించిన విషయములు ఉండుటవల వీటిని సంగీతమును అభ్యసించువారు చదువెడివారు.
 
=== సంగీత రత్నాకరము ===
శారంగదేవునిచే రచింపబడిన [[సంగీత రత్నాకరము]] మీద పలు వ్యాఖ్యానాలున్నాయి. వానిలో ఆంధ్ర కృతములు జనసమ్మతము లగుచుండెననియు తెలియుచున్నది. అట్టి ఆంధ్రవ్యాఖ్యాతలలో ముఖ్యులు చతురకల్లినాధుడు, సింహభూపాలుడు, కుంభకర్ణ భూమీశుకుడు మున్నగువారు. ఒప్పర్టుదొరగారు తమ సంస్కృత వ్రాత గ్రంథములో ''సంగీతరత్నాకరచంద్రికా'' అను వ్యాఖ్యానమును చెప్పెను. గ్రంథకర్తపేరు తెలియదు. కేశవ అను బ్రాహ్మణుడు మరియొక వ్యాఖ్యానమును రచించినట్లు ''సంగీతసుధ'' యందు తెలియుచున్నది. ఇది ఇప్పటి మద్రాసు గ్రంథాలయమునందు ఉంది.
 
పంక్తి 37:
=== శృతి ===
 
శ్రుతి అంటే [[ధ్వని]] విశేషం. గీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. శృతి అనగా స్థాయిని సూచిస్తుంది. ఈ సంగీతంలో ఇతర అంశాలకు ఇది ప్రాథమిక భావన లాంటిది.<ref>[http://www.karnatik.com/glosss.shtml Royal Carpet: Glossary of Carnatic Terms]</ref>. ఇది పాశ్చాత్య సంగీతంలో ''టానిక్'' లేదా ''కీ''కి దగ్గరగా ఉంటుంది. అష్టమ స్వరాల్లో స్థాయీ భేదాన్ని సూచించడానికి కూడా దీనిని వాడుతుంటారు. ఒక రాగంలో ఎన్నిరకాలైన స్థాయి భేదాలైనా ఉండవచ్చు కానీ సాధారణ మానవుని చెవి కేవలం ఇరవై రెండింటిని మాత్రమే గుర్తించగలదు. ఒక్కోసారి శ్రోత దృష్టిలో ఇది భావాన్ని కూడా సూచిస్తుంది.<ref>http://www.soundofindia.com/showarticle.asp?in_article_id=952096767 {{Webarchive|url=https://web.archive.org/web/20081211064155/http://www.soundofindia.com/showarticle.asp?in_article_id=952096767 |date=2008-12-11 }} Sound of India</ref>
 
=== స్వరం ===
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు