వేంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
[[బొమ్మ:Inscription Pedavegi.JPG|right|thumb|పెదవేగి త్రవ్వకాలలో లభించిన ఒక శాసనం]]
{{main|తూర్పు చాళుక్యులు}}
వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. ఆంధ్ర దేశ ఐక్యతను సాధించలేకపోయారు ([[శాతవాహనులు|శాతవాహనుల]] తరువాత [[కాకతీయులు]] మాత్రమే ఈ పని చేశారు.) ఇతర ప్రాంతాలలో పల్లవ సామంతులు, బాణ వైదుంబులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాళవపాలన సాగించారు. అంతే గాకుండా వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు. అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని కాంక్షించి పాలించారు. నాటివరకు రాజాస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు.అందు చేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి తావుండరాదు<ref name="BSL"/>. శాతవాహనుల కాలంలో సంస్కృతం పండిత భాష, ప్రాకృతం రాజభాష, తెలుగు పామరుల భాష<ref> పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర</ref>. వేంగి చాళుక్యుల కాలంలోనే తెలుగు పండిత భాషగాను, ప్రజల భాషగాను, రాజభాష గాను మూడు వన్నెల ఔన్నత్యాన్ని సమకూర్చుకొంది. మార్గకవితను సేవించుచుండిన ఆంధ్రులకు తెలుగు కవితను పుట్టించి, '''తెలుగు నిలిపిన''' యశము చేకూర్చిన ఘనత (నన్నయకు కాదు) చాళుక్య రాజులకు దక్కింది<ref>'''మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుంగును నిలిపిరంద్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలుగ పలువుల్''' - [[నన్నెచోడుడు]] </ref>.
 
క్రీ.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని భార్య అయ్యణమహాదేవి జైన మతాభిమాని.
పంక్తి 154:
 
 
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అతఃకలహాలుఅంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధృవుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగఅసామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ట తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.
 
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రఅజురాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి యుద్ధంలో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
 
==చాళుక్య చోళులు==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు