వేంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
 
హస్తివర్మ కుమారుడు నందివర్మ (350-385). ఇతడు తిరుగుబాటుదారులను అఞచివేసిఅణచివేసి [[కృష్ణానది]] దక్షిణానికి కూడా వేంగి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ధార్మిక చింతనపరుడు. "వివిధధర్మ ప్రధానస్య" అని పెదవేగి శాసనంలోను (కనుక వారు బౌద్ధ, వైదిక ధర్మాలను రెంటినీ ఆదరించినట్లు తెలుస్తున్నది), "ఆర్జిత ధర్మ ప్రదానస్య, గీసహస్రదాయి" అని గుంటుపల్లి శాసనంలోను వర్ణింపబడ్డాడు. ఇతని తరువాత ఇతని తమ్ముడు దేవవర్మ, కొడుకు అచండవర్మల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం జరగడం వలన శాలంకాయనుల ప్రతిష్ఠ దిగజారింది. అంతే గాకుండా ఉత్తరాన పిష్ఠపురం ([[పిఠాపురం]])లో మాఠరులు, దక్షిణాన కర్మరాష్ట్రంలో బలవంతులై శాలంకాయనులతో పోరాడసాగారు. క్రీ.శ.5వ శతాబ్ధి ప్రాంతంలో శాలంకాయనుల రాజ్యం అస్తమించింది. వారిలో చివరిరాజు విజయనందివర్మ గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేశాడు.
 
 
శాలంకాయనులకు ఇంచుమించు సమకాలికులుగా కృష్ణానది దక్షిణాన కర్మరాష్ట్రాన్ని ఆనందగోత్రిజులు పాలించారు. కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతం 'సింహపురి' (శ్రీకాకుళం వద్దనున్న సింగపురం) రాజధానిగా కళింగులు, తరువాత మాఠరులు పాళించారు. ఉత్తరాన పిష్ఠపురం ప్రాంతాన్ని కొంతకాలం కళింగులు, తరువాత మాఠరులు, తరువాత వాసిష్ఠులు పాలించారు.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు