అష్టవిధ వివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
విలీనం జరుగుతున్నది
పంక్తి 1:
 
'''అష్టవిధవివాహాలు:'''
[[యాజ్ఞవల్క్య స్మృతి]]ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన [[వివాహం|వివాహాలను]] శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి
 
#బ్రాహ్మ = విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
#దైవ = యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
Line 10 ⟶ 12:
 
(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)
 
==వివరణ==
 
 
;బ్రాహ్మం
ప్రతిఫల రహితంగా యోగ్యుడైన వరునకు అలంకరించబడిన [[కన్య]] ను ఇచ్చి వివాహం చెయ్యడం.. తలిదండ్రులు శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ [[కూతురు]] ను అలంకరించి తగిన సమర్దుడైన వరుని చూసి కూతురి చేతిని అతని చేతిలో కలపి పాణిగ్రహణం చేస్తారు.
 
;దైవం
యజమాని గృహంలో దైవ [[యజ్ఞం]] చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.
 
;ప్రాజాపత్యం
కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వదూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్దితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో [[కట్నం]], [[కన్యాశుల్కం]] అనే ప్రశక్తి ఉండదు.
 
;ఆర్షం
వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లి దండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.
 
;ఆసురం
వదువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.
 
;గాంధర్వం
వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.
 
;పైశాచం
కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వదువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.
 
;రాక్షసం
కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి. [[శ్రీకృష్ణుడు]] [[రుక్మిణీదేవి]] పెళ్ళాడినది ఈ పద్దతిలోనే అయితే అది ఆమె ఇష్టముతో జరిగినది.
 
ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో [[స్వయంవరం]] అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు. శివదనుస్సును విరిచి [[శ్రీరాముడు]] [[సీత]] ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ [[ద్రౌపదిని]] [[పాండవులు]] చేపట్టినది ఈపద్దతినే.
 
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/అష్టవిధ_వివాహాలు" నుండి వెలికితీశారు