హైమండాఫ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పరిచయ వాక్యం చేర్పు
పంక్తి 1:
[[హెమండార్ఫ్|క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హెమండార్ఫ్]] లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు. 1940లో కొమరం భీము అనే [[గోండు]] విప్లవకారుడు నిజాం నిరంకుశత్వంపై, దోపిడీ విధానాలపై తిరుగుబాటును లేవదీశాడు. సాయుధ బలగాలను పంపి, కొమరం భీముని, ఆదిలబాదులోని "జోడేఘాట్" వద్ద కాల్చి చంపినా, గోండులలో చెలరేగిన అలజడిని, అశాంతిని అణచలేకపోయారు. ఈ అశాంతి కారణాలను
విశ్లేషించి, తగు సూచనల నివ్వవలసిందిగా అప్పటి నిజాం ప్రభుత్వం, లండన్ యునివర్సిటీ మానవశాస్త్ర (Anthropology) విభాగాధ్యక్షుడైన ప్రొఫెసర్ క్రిష్టఫ్ ఫాన్ ఫ్యూరర్ హెమండార్ఫ్ (Prof.Christoph von Fürer-Haimendorf)ను కోరింది. పరిశీలన కోసం వచ్చిన మనిషి, గోండుల దైన్యాన్ని చూసి, కరిగిపోయి, ఆ సమస్యల
పరిష్కారాన్ని అన్వేషిస్తూ, "మార్లవాయి" గ్రామంలో ఏళ్ళతరబడి ఉండిపోయాడు. ఆయన పుణ్యమా అని, గోండులకు భూమిపై హక్కు, పట్టాలూ లభించాయి. వారి అభివృద్ధికై ప్రప్రథమంగా చట్టాలు చేయబడ్డాయి. ఈ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారం క్రమబద్ధం అయింది. వారికి సేవ చేయడమే కాక, వారి ఆచారవ్యవహారాల గురించీ, సమస్యల గురించీ రెండు పుస్తకాలను వ్రాశాడు హెమండార్ఫ్. గోండుల గురించి పుస్తక పరిజ్ఞానం సంపాదించాలంటే, యీ రోజు వరకు, యీ పుస్తకాలు తప్ప వేరే లేవు.
"https://te.wikipedia.org/wiki/హైమండాఫ్" నుండి వెలికితీశారు